Balakrishna Wig : నందమూరి నటసింహం బాలకృష్ణ తనదైన ముద్ర వేసుకొని ఇటు రాజకీయాల్లో అటు సినిమాల్లో దూసుకొనిపోతున్నారు. ఆయన సీటును ఢీకొట్టే వారు లేరనే చెప్పాలి. సినిమాల్లోనూ ఫుల్ బిజీ, రాజకీయాల్లోనూ ఫుల్ బిజీ. రెండింటిలో తనది ప్రత్యేకమైన స్థానం. అందుకే అంతులేని అభిమానులు ఆయన సొంతం. ఇక సినిమా వేడుకల్లో రాజకీయాలు, రాజకీయా వేడుకల్లో సినిమాల గురించి ప్రస్తావించరు బాలయ్య. కానీ ఈ సారి మాత్రం హైదరాబాద్ లో జరిగిన భగవంత్ కేసరి ప్రెస్ మీట్ లో సినిమా గురించి మాట్లాడుతూనే రాజకీయాల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
బాలకృష్ణ ఎవడిదో బొచ్చు పైన పెట్టుకొని తిరుగుతాడు అని ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు బాలయ్య. నాని పేరు ఎత్తకుండానే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ఈ నెల 19వ తారీఖున ప్రేక్షకుల ముందు సందడి చేయనుంది. దీంతో గ్రాండ్ గా ప్రెస్ మీట్ ను నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ప్రెస్ మీట్‌లో హీరో బాలకృష్ణ, శ్రీలీల, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు, సంగీత దర్శకుడు థమన్, సినిమాటోగ్రాఫర్ సి.రాంప్రసాద్, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలయ్య సినిమాటోగ్రాఫర్ సి.రాంప్రసాద్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘రాంప్రసాద్ అద్భుతమైన కెమెరామేన్. నా ప్రతి కదలిక ఆయనకు తెలుసు. వీఎస్ఆర్ స్వామి దగ్గర ఈయన అసిస్టెంట్‌గా ఉన్నప్పటి నుంచీ మేమంతా కలిసి ఉండేవాళ్లం.. కలిసి భోజనం చేసేవాళ్లం. ఆ రోజుల్లో ఇప్పటిలా క్యారావ్యాన్‌లు లేవు కదా. హ్యాపీగా చెట్ల కింద కూర్చొని కింద ఒక చాప, దిండు వేసుకుని పడుకునేవాళ్లం. విగ్గు తీసి పక్కన పెట్టేవాడిని. మొన్న ఎవడో అన్నాడు.. ఎవడో ఎదవ.. వీడు విగ్గు పెట్టుకుంటాడా అని. అవునయ్యా విగ్గు పెట్టుకుంటా నీకేంటి.. నువ్వేం పీక్కొని గెడ్డం పెట్టుకుంటావ్ అని అడిగా. మనదంతా ఓపెన్ బుక్. ఎవడికి భయపడే పనేలేదు. వాడికి చెప్తున్నా.. మళ్లీ వాగాడంటే’ అంటూ నవ్వుతూ టాపిక్ డైవర్ట్ చేశారు బాలయ్య.
ఇవ్వాల్సిన కౌంటర్ స్ట్రాంగ్ గా ఇచ్చిన బాలయ్య ఆ తర్వాత సినిమాల్లోకి టాపిక్ ను మళ్లించారు. ఇలా ఆయన సినిమా ప్రెస్ మీట్ లో రాజకీయంగా మాట్లాడడం ఇదే తొలిసారి అంటున్నారు ఆయన అభిమానులు. చాలా హట్ అయ్యారు కాబట్టే ఈ విధంగా మాట్లాడారని సపోర్ట్ చేస్తున్నారు అభిమానులు.