British Rule: భారత్ లోని ఆ ప్రాంతానికి భయపడ్డ బ్రిటిష్ సైన్యం 100 ఏళ్ల ముందే వెళ్లిందెందుకు?

భారతదేశంలో ఆంగ్లేయులు వందేళ్లకు పైగా తిష్ట వేశారు. భారతీయుల ప్రతిఘటనతో వారు మన దేశాన్ని విడిచి వెళ్లారు. బ్రిటిష్ వారిని వెళ్లగొట్టేందుకు ఎందరో ప్రాణాలను వదిలారు. కొందమంది చిత్ర హింసలకు గురయ్యారు. గాంధీ లాంటి నాయకులు సహనంతో ఆందోళనలు నిర్వహించి దేశం నుంచి వెళ్లగొట్టారు. అయితే బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు మనుషులే కాకుండా ఇండియాలోని కొన్ని పట్టణాలు కూడా సహకరించాయి. దేశంలో ఓ పట్టణాన్ని ఆంగ్లేయులు ఆక్రమించుకోలేకపోయారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేకపోయారు. ఆ ప్రాంతానికి భయపడ్డ […]

Written By: NARESH, Updated On : August 26, 2021 10:43 am
Follow us on

భారతదేశంలో ఆంగ్లేయులు వందేళ్లకు పైగా తిష్ట వేశారు. భారతీయుల ప్రతిఘటనతో వారు మన దేశాన్ని విడిచి వెళ్లారు. బ్రిటిష్ వారిని వెళ్లగొట్టేందుకు ఎందరో ప్రాణాలను వదిలారు. కొందమంది చిత్ర హింసలకు గురయ్యారు. గాంధీ లాంటి నాయకులు సహనంతో ఆందోళనలు నిర్వహించి దేశం నుంచి వెళ్లగొట్టారు. అయితే బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు మనుషులే కాకుండా ఇండియాలోని కొన్ని పట్టణాలు కూడా సహకరించాయి. దేశంలో ఓ పట్టణాన్ని ఆంగ్లేయులు ఆక్రమించుకోలేకపోయారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేకపోయారు. ఆ ప్రాంతానికి భయపడ్డ బ్రిటిష్ సైన్యం శతాబ్దం ముందే తట్ట బుట్టా సర్దుకొని వెళ్లిపోయారు. మరోసారి ఆ ప్రాంతానికి రాము బాబోయ్ అంటూ పరుగులు తీశారు. ఆంగ్లేయులను అంతగా భయపెట్టిన పట్టణం ఏది..? బ్రిటిష్ వారు ఆ ప్రాంతానికి ఎందుకు భయపడ్డారు..?

ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కలిగిన పట్టణం ఏది..? అనే ప్రశ్న చాలా పరీక్షల్లో వచ్చింది. విద్యార్థులకు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసే ఉంటుంది. అత్యధిక వర్షపాతం కలిగిన పట్టణం చిరపుంజి. అయితే దీనికే సోహ్ర అనే పేరు కూడా ఉంది. అత్యధికంగా సోహ్రాలో సగటున 11.43 మీటర్ల వర్షపాతం నమోదవుతుంది. 1861లో 26.46 మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే అత్యధిక రికార్డు. అలాగే 1995లో సోహ్రాలో 48 గంట్లల్లో 2.49 మీటర్ల వర్షపాతం నమోదై మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇక్కడ వీచే గాలులకు గొడుగులు పనిచేయవు. దీంతో ఇక్కడి ప్రజలు వెదురుతో కొన్ని రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ కురిసే వాన నీటితో అమెరికాలోని స్టాట్యూ ఆప్ లిబర్టీని సగం వరకు ముంచేయవచ్చు.

మేఘాలయ రాష్ట్రంలోని ఉన్న సోహ్ర పట్టణంలో ఖాసీ తెగకు చెందిన ప్రజలు జీవిస్తారు. ఇక్కడి వాతావరణానికి వీరు మాత్రమే తట్టుకోగలరు. ఇతరులు ఎక్కువకాలం ఇక్కడ జీవించలేరు. భారతదేశాన్ని మెల్ల మెల్లగా ఆక్రమిస్తున్న ఆంగ్లేయులు సోహ్రాను ఆక్రముంచుకోవాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగా 1831లో ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారు రాగానే వర్షం ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. వర్షం లేనప్పుడు కూడా మబ్బులతో కూడిన వాతావరణం ఉండేది. దీంతో ఈ వాతావరణంలో బ్రిటిష్ వారు తట్టుకోలేకపోయారు. వారి టేబుళ్లు బిగించడానకి అనువైన పరికరాలు లభించలేదు. పుస్తకాలు, ఆహార పదార్థాలు పాడయ్యాడు. ఇక్కడుండే ఖాసీం ప్రజలు బ్రిటిష్ వారికి అనుగుణంగానే ఉండేవారు. కానీ ఇక్కడి వాతావరణం ఆంగ్లేయులతో యుద్ధం చేసింది.

వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక చాలా మంది బ్రిటిష్ అధికారులు మానసిక ఆందోళనకు గురయ్యారు. కొందరు వేదన భరించలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. తీవ్ర ఒత్తిడికి గురైన శ్వాస కూడా ఆడని పరిస్థితి ఏర్పడింది. దీంతో 1864లో బ్రిటిష్ ప్రభుత్వం తమ సైన్యాన్ని ఆ ప్రాంతం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అప్పటి వరకు 1864లో ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కేంద్రంగా ఉన్న సోహ్రా నుంచి 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిల్లాంగ్ పట్టణానికి మార్చారు.

అత్యధిక వర్షపాతం ప్రాంతంగా పేరొందిని సోహ్రాలో ఇప్పుడు పరిస్థితులు మారాయి. క్రమంగా ఇక్కడ వర్షాలు తగ్గుతున్నాయి. తాగునీటికి కూడా ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందంటే పరిస్థితి ఏ రకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి వారు బట్టలు ఉతుక్కోవడానికి కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. మే నుంచి సెప్టెంబర్ మధ్య నిత్యం వర్షం కురిసే ఈ ప్రాంతం ఇప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు వచ్చింది. ఇప్పటి వరకు అత్యధిక వర్షపాతంగా పేరున్న చిరపుంజి నుంచి ఆ పేరును మాసిన్రం దక్కించుకుంది.