https://oktelugu.com/

టీకాల్లో భారత్ స్పీడు.. అమెరికాను అధిగమించాం

టీకాలు అందుబాటులోకి రావడం లేటు కావచ్చు.. కానీ.. వేయడంలో మాత్రం మన వైద్యసిబ్బంది ముందున్నారు. ఎప్పుడో డిసెంబర్ లో అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. ఇప్పటికీ అమెరికాలో 32 కోట్ల మందికి ఒక డోసు వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. అయితే భారత్ లో మాత్రం లేటుగా వ్యాక్సినేషన్ ప్రారంభించింది. గత రెండు నెలలుగానే కొంచెం వేగంగా వ్యాక్సిన్లు వేస్తున్నారు. జూన్ 21 నుంచి జెట్ స్పీడుగా కరోనా వ్యాక్సినేషన్ దేశంలో జరుగుతోంది. దీంతో తాజాగా ఈరోజు కు దేశంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : June 28, 2021 / 02:55 PM IST
    Follow us on

    టీకాలు అందుబాటులోకి రావడం లేటు కావచ్చు.. కానీ.. వేయడంలో మాత్రం మన వైద్యసిబ్బంది ముందున్నారు. ఎప్పుడో డిసెంబర్ లో అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. ఇప్పటికీ అమెరికాలో 32 కోట్ల మందికి ఒక డోసు వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.

    అయితే భారత్ లో మాత్రం లేటుగా వ్యాక్సినేషన్ ప్రారంభించింది. గత రెండు నెలలుగానే కొంచెం వేగంగా వ్యాక్సిన్లు వేస్తున్నారు. జూన్ 21 నుంచి జెట్ స్పీడుగా కరోనా వ్యాక్సినేషన్ దేశంలో జరుగుతోంది. దీంతో తాజాగా ఈరోజు కు దేశంలో వేసిన వ్యాక్సిన్లతో ఏకంగా అమెరికాను భారత్ అధిగమించినట్టైంది.

    అగ్రరాజ్యం అమెరికా ఆ దేశంలో 32.33 కోట్ల మందికి కరోనా టీకాను వేసింది. తాజాగా నిన్నటితో భారత్ దేశం కూడా 32.36 కోట్ల డోసులను అందించి అమెరికాను అధిగమించేసింది.

    18 ఏళ్లు దాటిన ప్రతి భారతీయుడికి ఉచితంగా టీకా అందించేలా కేంద్రం గత నెల మార్గదర్శకాలు సవరించిన సంగతి తెలిసిందే. జూన్ 21 నుంచి అవి అమల్లోకి వచ్చాయి. ఆ రోజున రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా ఏకంగా 86 లక్షల మందికి టీకా వేశారు. ప్రతిరోజు కూడా దేశవ్యాప్తంగా లక్షల టీకాలు వేస్తున్నారు. ఈ వారం రోజుల్లోనే దేశంలో 4.1 కోట్లకు పైగా డోసులు వేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

    ఇలా జెట్ స్పీడుగా కరోనా టీకాలు వేస్తూ భారతదేశం దూసుకుపోతోంది. అమెరికాను సైతం అధిగమించింది. అయితే అమెరికాలో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 15 కోట్లు దాటగా.. భారత్ లో మాత్రం 5.67 కోట్ల మందికే రెండో డోసు అందింది. కరోనా టీకాల కొరత .. కోవీషీల్డ్ టీకాల మధ్య వ్యవధి 84 రోజులకు పెంచడంతో ఈ పరిస్థితి దాపురించింది.

    ఇక ప్రపంచంలోనే అందిరికంటే అత్యధికంగా కరోనా టీకాలను చైనా పంచింది. ఆ దేశ జనాభాలోని 100 కోట్ల మందికి టీకాలు ఇవ్వడం విశేషం.