చైనాపై రెండు అస్త్రాలు.. భారత్ భారీ యాక్షన్ ప్లాన్

కర్ర విరగకుండా పామును (చైనా)ను చంపేయాలి? ఎలా? ఎలా అని ఆలోచించిన కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇప్పుడు చైనాతో ఫైట్ కు భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం. ఓవైపు చైనాతో యుద్ధం వస్తే కాచుకోవడం పోరాడడమే కాదు.. ఏకంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీయడానికి రెడీ కావడం కూడా భారత్ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. ఇందుకోసం చైనా దురాక్రమణతో ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న దాని పొరుగుదేశం జపాన్ తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూరప్ దేశాల […]

Written By: NARESH, Updated On : June 22, 2020 1:32 pm
Follow us on


కర్ర విరగకుండా పామును (చైనా)ను చంపేయాలి? ఎలా? ఎలా అని ఆలోచించిన కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇప్పుడు చైనాతో ఫైట్ కు భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం. ఓవైపు చైనాతో యుద్ధం వస్తే కాచుకోవడం పోరాడడమే కాదు.. ఏకంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీయడానికి రెడీ కావడం కూడా భారత్ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. ఇందుకోసం చైనా దురాక్రమణతో ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న దాని పొరుగుదేశం జపాన్ తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూరప్ దేశాల సాయం తీసుకునేందుకు భారత్ ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయం సమాచారం.

మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?

చైనా ఇప్పటికే మన చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలను మచ్చిక చేసుకొని భారత్ పైకి ఎగదోస్తోంది. తాజాగా మన మిత్రదేశం నేపాల్ కూడా మనకు వ్యతిరేకంగా మారింది. ఈ క్రమంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లో చైనాకు లొంగకూడదని డిసైడ్ అయ్యింది. 20 మంది భారత సైనికులను చంపిన చైనాపై ప్రతీకారానికి రెడీ అవుతోంది.

ఈ క్రమంలో భారత్ కొనుగోలు చేసినా ఇంకా డెలివరీ కానీ ప్రపంచంలోనే నంబర్ 1 యుద్ధ విమానాలు ‘రాఫెల్’ను ఇవ్వాలని ఫ్రాన్స్ ను తాజాగా భారత్ కోరిందట.. తయారీ దశలో ఉన్న రాఫెల్స్ స్థానంలో ఫ్రాన్స్ దేశ సైన్యం వద్ద ఉన్న రాఫెల్స్ అత్యవసర యుద్ధం వస్తే ఇవ్వడానికి ఫ్రాన్స్ ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ దగ్గరున్న 35 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కోరితే ఇస్తామని ఫ్రాన్స్ చెప్పిందట.. ఇక ఆస్ట్రేలియా, జపాన్ లు కూడా చైనా దక్షిణ చైనా సముద్రంపై చేస్తున్న అరాచకాలకు చెక్ పెట్టడానికి భారత్ కు సాయం చేయడానికి రెడీ అయ్యాయి.

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

ఇక చైనాపై కోపంతో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికన్ ఇంటెలిజెన్స్ తో భారత్ కు సాయం చేయడానికి చూస్తున్నాడట.. మోడీ-ట్రంప్ మధ్య స్నేహంతో అమెరికా కూడా భారత్ కు సపోర్టుగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనాను ప్రపంచానికి అంటించిన చైనా ఆగడాలకు చెక్ పెట్టాలంటే భారత్ కు అందరూ సపోర్ట్ చేయాలని పాశ్చాత్య దేశాలన్ని రెడీ అయ్యాయని తెలిసింది.

ఇక భారత్ కూడా సర్వ ప్రయత్నాలు చేస్తూ అన్నింటికి రెడీ అవుతోంది. చైనాను రెండు రకాలుగా దెబ్బకొట్టాలని తాజాగా భారత్ రెడీ అయ్యింది. యుద్ధానికి సిద్ధమవుతూనే చైనా వస్తువుల నిషేధం దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. దేశమంతా చైనా వస్తువులు, యాప్స్ నిషేధించాలన్న డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంది.

చిరు పవన్ ల మధ్య అగ్రతాంబూలమే అడ్డు..!

తాజాగా చైనాతో ఉద్రిక్తత నేపథ్యంలో యుద్ధ సన్నాహాల కోసం 500 కోట్ల అత్యవసర నిధిని ఆయుధాల కొనుగోలుకు కేటాయిస్తూ భారత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా చైనా ఉత్పత్తుల దిగుమతుల జాబితాను సమర్పించాలంటూ ఇండియన్ కార్పొరేట్లకు ఆదేశాలను జారీ చేసింది.

మొత్తం భారత్ కు చైనా నుంచి దిగుమతుల వాటా 14శాతం ఉంది. మొబైల్స్, టెలికాం, పవర్, ప్లాస్టిక్ , ఫార్మా ముడిసరుకులను చైనా నుంచి భారత్ కు దిగుమతి అవుతున్నాయి. భారత ప్రభుత్వ ఆదేశాలతో ఈ జాబితాను అధికారులు రెడీ చేశారు. వీటన్నింటని వెంటనే దేశంలో ఉత్పత్తి చేయడానికి స్వావలంబన సాధించడానికి ప్రధాని కార్యాలయం కార్పొరేట్లతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ పరిణామాలతో చైనా వస్తువుల బహిష్కరణ దిశగానే కేంద్రం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతోపాటు ఆయుధాల కొనుగోలుతో అటు యుద్ధానికి రెడీ అవుతోంది. ఇలా భారత్ ఏకంగా చైనాతో డూ ఆర్ డై తేల్చుకోవడానికి రెడీ కావడం ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.

-ఎన్నం