https://oktelugu.com/

జగన్ టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు. ఆ రెండు పత్రికలు

అవును.. ఏపీ సీఎం జగన్ సరిగ్గా ఏడాది పాలన ముగిశాక తన ప్రతీకారం మొదలుపెట్టాడు. ఇప్పటికే తన ప్రత్యర్థులైన టీడీపీ నేతలు ఇద్దరిని అరెస్ట్ చేయించి జైలుకు పంపిన జగన్ ఇప్పుడు చంద్రబాబు కాళ్ల కిందకు నీళ్లు తెచ్చే పనిలో బిజీగా ఉన్నారు. అయితే నాటి ప్రతిపక్ష నేతల తప్పులే వారికి శిక్ష పడేలా చేస్తుండడం కూడా జగన్ పనిని సులువు చేస్తోంది. జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా? అయితే నేతలు ఎప్పుడూ ప్రతీకారాలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 22, 2020 / 01:52 PM IST
    Follow us on


    అవును.. ఏపీ సీఎం జగన్ సరిగ్గా ఏడాది పాలన ముగిశాక తన ప్రతీకారం మొదలుపెట్టాడు. ఇప్పటికే తన ప్రత్యర్థులైన టీడీపీ నేతలు ఇద్దరిని అరెస్ట్ చేయించి జైలుకు పంపిన జగన్ ఇప్పుడు చంద్రబాబు కాళ్ల కిందకు నీళ్లు తెచ్చే పనిలో బిజీగా ఉన్నారు. అయితే నాటి ప్రతిపక్ష నేతల తప్పులే వారికి శిక్ష పడేలా చేస్తుండడం కూడా జగన్ పనిని సులువు చేస్తోంది.

    జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

    అయితే నేతలు ఎప్పుడూ ప్రతీకారాలకు రెడీగానే ఉంటారు. హైకోర్టులకు ఎక్కి తమపై కేసులను నమోదు చేయకుండా.. ముందస్తు బెయిల్స్ తో కాలం గడుపుతారు. అందుకే జగన్ పక్కా ఆధారాలు సేకరించడానికి సంవత్సరం టైం తీసుకున్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలకు బెయిల్ దొరక్కుండా వారికి కటకటాలను లెక్కించేలా చేస్తున్నారు.

    వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఆ రెండు పత్రికలు టీడీపీకి సపోర్టుగా చేసిన రాజకీయం అంతా ఇంతాకాదు. అది జగన్ ఎప్పుడూ మరిచిపోలేదు. కోడికత్తి నుంచి మొదలుపెడితే వైఎస్ వివేకా హత్యవరకు జగన్ ను ఆ రెండు పత్రికలు ఎంత అభాసుపాలు చేయాలో అంతా చేశాయి. ఎన్నోసార్లు జగన్ జైలు జీవితాన్ని దెప్పిపొడిచాయి. ఆయనపై దారుణంగా దుష్ప్రచారం చేశాయి. నాడు అధికారంలోని లేని జగన్ ఆ రెండు పత్రికలను కాచుకోలేదు.

    రాజధాని తరలింపుపై ప్రభుత్వం వెనక్కి?

    అయితే నేడు సీఎం జగన్ గా మారాడు. చేతిలో అధికారం ఉంది. దీంతో కొరఢా ఝలిపిస్తున్నాడు. జగన్ జూలు విదిల్చినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా చంద్రబాబుతోపాటు ఆయనకు సపోర్టు చేసే ఆ రెండు పత్రికలకు జగన్ ప్రభుత్వం నోటీసులు పంపింది.. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కేసులు కూడా పెడుతామని స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని.. పౌరసరఫరాల శాఖ బియ్యం పంపిణీ కోసం అవసరమయ్యే సంచులను జగన్ కంపెనీ నుంచి ఎలాంటి టెండర్ లేకుండా కొనుగోలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. దాన్ని ఆ రెండు పత్రికలు ప్రచురించడమే జగన్ ఆగ్రహానికి కారణమైందట.. అందులో జగన్ పవర్ ప్రాజెక్టు కూడా ఉండడంతో ఆయనపై వ్యతిరేకంగా కథనాలను ఆ పత్రికలు వండివర్చాయి. ప్రభుత్వ వివరణను చిన్నగా మూలకు తొక్కేశాయి. దీంతో అపవాదు జగన్ మీద పడింది.

    చిరు పవన్ ల మధ్య అగ్రతాంబూలమే అడ్డు..!

    అందుకే ఇక ఉపక్షేంచకూడదని నిర్ణయించుకున్న సీఎం జగన్.. తాజాగా చంద్రబాబుతోపాటు ఆ రెండు పత్రికలకు నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా భేషరతుగా క్షమాపణ చెప్పాలని..లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తామని.. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాల కృష్ణ ద్వివేది ప్రభుత్వం తరుపున స్పష్టం చేశారు. ఖండనను ఏపీ ప్రభుత్వం ప్రచురించినా అది సంతృప్తికరంగా లేదని..మరో పత్రిక అసలు ఖండనను కూడా ప్రచురించలేదన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఆ రెండు పత్రికలను వదిలిపెట్టేది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. సంచుల కొనుగోలు కోసం గత ఏడాది డిసెంబర్ 3న ఈనాడుతోపాటు టైమ్స్ ఆఫ్ ఇండియాలో టెండర్ ప్రకటన ఇచ్చామని పక్కాగానే టెండర్ నిర్వహించామని.. కొనుగోలు చేశామని ద్వివేది చెప్పారు. టెండర్లు లేకుండానే సొంత సంస్థ నుంచి కొన్నారని పత్రికలు రాయడం దుర్మార్గమన్నారు.

    ఇలా చంద్రబాబు అధికారం కోల్పోయినా ఆ రెండు పత్రికలు జోష్ మాత్రం తగ్గడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకు బాకా ఊదడం.. జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే చర్యలకు దిగుతూనే ఉన్నాయి. అందుకే ఇక ఉపక్షించరాదని జగన్ డిసైడ్ అయ్యారు. ఆ రెండు పత్రికలతోపాటు చంద్రబాబుకు నోటీసులు పంపారు. సివిల్, క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం చేశారు. దీంతో జగన్ కౌంట్ డౌన్ స్ట్రాట్ చేసినట్టే కనిపిస్తోంది.