Indians Funds in Swiss Banks: నల్లధనం అరికట్టేందుకు కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మనోళ్ల అక్రమ సంపాదన మాత్రం ఆగడం లేదు. ఇక్కడ సపాదించిన సొమ్మంతా తీసుకెళ్లి స్విస్ బ్యాంకులో జమ చేసుకుంటున్నారు. ఇలా మనోళ్ల సంపద ఏటా పెరుగుతూ పోతోంది. నల్లధనం అరికట్టేందుకు కేంద్రం పెద్దనోట్లు రద్దు చేసింది. దాదాపు 3 లక్షల కోట్ల నల్లధనం బయటపడుతుందని భావించింది. కానీ అది నరేంద్రమోదీ విఫల ప్రయత్నమే అయింది. దీంతో ప్రతిపక్షాలకు మంచి ఆయుధం దొరికింది. వీలైనప్పుడల్లా నోట్ల రద్దు విషయాన్ని ప్రచారానికి వాడుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా మోదీ నల్లధనం ఎంత తెచ్చావని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దేశంలోని కొంతమంది కుబేరులు దేశం విడిచిపోవడం, అంబానీ, అధానీలు అపర కుబేరులుగా మారడం కూడా మోదీకి ఇబ్బందిగా మారాయి. దేశం సంపదను ప్రధాని సంపన్నులు, కార్పొరేట్ శక్తులకే దోచి పెడుతున్నారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాఫీ, రాయితీలు కూడా సంపన్నులకే ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో మనోళ్ల నల్లధనం స్విస్ బ్యాంకులో భారీగా పెరగడం చర్చనీయాంశంగా మారింది.
44వ స్థానంలో భారత్
స్విస్ బ్యాంకు భారతీయులు దాచిపెట్టిన సంపద గణనీయంగా పెరిగింది. వరుసగా రెండో ఏడాది కూడా భారీగా పుంజుకుంది. భారతీయలు, కంపెనీలు, పెట్టుబడులు, హోల్డింగ్స్ విలువ 14 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. 2020 ముగింపు నాటికి స్విస్ బ్యాంకుల్లోని నిధులు దాదాపు మూడు రెట్లు పెరిగి 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు(రూ. 20,700 కోట్లు)గా ఉండటం గమనార్హం. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, కంపెనీల ద్వారా 2021లో 83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (రూ.30,626 కోట్లకు) పెరిగాయని స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.
Also Read: Megastar Chiranjeevi- Akkineni Akhil: మెగాస్టార్ చిరంజీవి తో యుద్దానికి సిద్దమైన అక్కినేని అఖిల్
సెక్యూరిటీలు, సంస్థాగత హోల్డింగ్స్ గణనీయంగా పెరిగాయని ధ్రువీకరించింది. దీని ప్రకారం మొత్తం స్విస్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో (239 బ్యాంకులు) కస్టమర్ డిపాజిట్లు 2021లో దాదాపు 2.25 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు పెరిగాయి. ఫారిన్ క్లయింట్స్ ఫండ్స్ కు సంబంధించిన జాబితాలో భారత్ 44వ స్థానంలో ఉండగా యూకే, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. యూకే 379 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్. 168 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌గా ఉన్నాయి. ఆ తరువాత వెస్టిండీస్, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, హాంగ్‌కాంగ్, లక్సెంబర్గ్, బహమాస్, నెదర్లాండ్స్, కైమన్ ఐలాండ్స్, సైప్రస్ దేశాలు టాప్‌లో ఉన్నాయి.
2006లో 6.5 బిలియన్ ఫ్రాంకులే..
స్విస్ బ్యాంకుల్లో మనవాళ్ల సంపద 2006లో గరిష్టంగా 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌గా ఉండేది. అయితే 2016లో దేశంలో డీమానిటైజేషన్ ఫలితంగా 2018లో 11 శాతం, 2017లో 44 క్షీణించాయి. 2019 చివరి నుంచి కస్టమర్ డిపాజిట్లు పడిపోయాయని స్విస్‌బ్యాంకు తెలిపింది. అయితే 2011, 2013, 2017, 2020, 2021లో ఈ ట్రెండ్ రివర్స్ అయింది. స్విస్ బ్యాంకులకు తరలిపోతున్న భారతీయుల సంపద క్రమేపీ పెరుగుతూ వస్తోంది. బ్యాంకు ఖాతాదారుల వివరాలను బ్యాంకు గోప్యంగా ఉంచడం నల్ల కుబేరులకు కలిసి వస్తోంది. ఇందులో కేంద్రంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులూ ఉన్నారు. కానీ బ్యాంకు నిబంధనలు వారిని రక్షిస్తున్నాయి.
Also Read:Pawan Kalyan- Akira Nandan: ఫాథర్స్ డే రోజు పవన్ కళ్యాణ్ కి మర్చిపోలేని బహుమతి ఇచ్చిన అకిరా నందన్