Megastar Chiranjeevi- Akkineni Akhil
Megastar Chiranjeevi: టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..దశాబ్దాల కాలం నుండి ఎంతో మంది యువ హీరోలు ఇండస్ట్రీ కి వచ్చి ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టినప్పటికీ కూడా చిరంజీవి స్థానం ని ఎవరు అందుకోలేకపోయారు..70 ఏళ్ళ వయసుకి దగ్గరౌతున్న కూడా ఇప్పటికి ఇండస్ట్రీ లో చిరంజీవి గారే నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు..ఆయన సినిమా వస్తుందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది..చిరు సినిమా విడుదలకి దగ్గర్లో ఉంటుందంటే ఎంత పెద్ద హీరో అయినా ఆయనతో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడానికి కాస్త ఆలోచిస్తారు..అలాంటిది ఇప్పుడు ఒక కుర్ర హీరో మెగాస్టార్ చిరంజీవి కి పోటీగా తన సినిమాని దింపడానికి సిద్దమైపోయాడు..అతను మరెవరో కాదు..అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్..ఆయన ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఏజెంట్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అక్కినేని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Megastar Chiranjeevi- Akkineni Akhil
అక్కినేని అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది..డబ్బింగ్ కార్యక్రమాలు మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్టే..ఇంత గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని దసరా కానుకగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు..అయితే అదే దసరా కి మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా విడుదల కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు..ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే.
Also Read: Pawan Kalyan- Akira Nandan: ఫాథర్స్ డే రోజు పవన్ కళ్యాణ్ కి మర్చిపోలేని బహుమతి ఇచ్చిన అకిరా నందన్
Megastar Chiranjeevi- Akkineni Akhil
చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య పెద్ద ఫ్లాప్ అవ్వడం తో గాడ్ ఫాదర్ పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు..సినిమా ఔట్పుట్ కూడా అద్భుతంగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..గాయపడిన సింహం లాగా మెగాస్టార్ ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ వద్ద విరుచుపడతాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు..మరి మెగాస్టార్ కంబ్యాక్ మూవీ లా ఉండబోతున్న గాడ్ ఫాదర్ ని తట్టుకొని ఏజెంట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించగలదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..అక్కినేని ఫాన్స్ కి ఈ సినిమా ఎంతో ప్రత్యేకం అని చెప్పొచ్చు..ఎందుకంటే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి అఖిల్ ఇప్పటి వరుకు ఒక్క భారీ హిట్ కూడా లేదు..అలాంటి సమయం లో మెగాస్టార్ తో పోటీకి దిగే రిస్క్ ఎందుకని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మాట..మొదటి నుండి అక్కినేని ఫామిలీ కి చిరంజీవి ఫామిలీ కి ఎంతో సఖ్యత ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్ళ మధ్య ఉన్న అనుబంధం వాళ్ళ ఎవరో ఒకరు కచ్చితంగా తగ్గుతారు అని మెగా అక్కినేని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.
Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ వార్నింగ్… దర్శక నిర్మాతలకు డెడ్ లైన్?