https://oktelugu.com/

Adivi Sesh Love Breakup: ప్రేమించిన అమ్మాయి అలా చేసింది… పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్న హీరో!

Adivi Sesh: మేజర్ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అడివి శేష్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకుంది. హిందీలో సైతం చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. హీరో మహేష్ బాబు ఎంతో నమ్మకంతో మేజర్ చిత్రాన్ని నిర్మించారు. ఓ మంచి చిత్రాన్ని నిర్మించారన్న పేరు ఆయనకు దక్కింది. అదే సమయంలో మేజర్ కమర్షియల్ సక్సెస్ ఆయనకు కొంతమేర లాభాలు పంచింది. ఇక మేజర్ చిత్రం కోసం అడివి […]

Written By:
  • Shiva
  • , Updated On : June 19, 2022 / 03:41 PM IST
    Follow us on

    Adivi Sesh: మేజర్ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అడివి శేష్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకుంది. హిందీలో సైతం చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. హీరో మహేష్ బాబు ఎంతో నమ్మకంతో మేజర్ చిత్రాన్ని నిర్మించారు. ఓ మంచి చిత్రాన్ని నిర్మించారన్న పేరు ఆయనకు దక్కింది. అదే సమయంలో మేజర్ కమర్షియల్ సక్సెస్ ఆయనకు కొంతమేర లాభాలు పంచింది.

    Adivi Sesh

    ఇక మేజర్ చిత్రం కోసం అడివి శేష్ చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ తో అనుబంధం పెంచుకున్నారు. వారి నుండి అనేక విషయాలు తెలుసుకున్నారు. కొన్ని రోజులు ఆర్మీ క్యాంప్స్ లో గడిపారు. ఆ పాత్రకు, సందీప్ లుక్ కి అనుగుణంగా బాడీని మార్చుకున్నారు. ఆయన కష్టానికి మేజర్ హిట్ రూపంలో ఫలితం దక్కింది. ఇక వరుస విజయాలతో ఊపుమీదున్న అడివి శేష్ ప్రస్తుత వయసు 36 ఏళ్ళు. ఈ క్రమంలో పెళ్లి డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. అనేక మీడియా సమావేశాల్లో పెళ్లి ఎప్పుడంటూ అడుగుతున్నారు. ఈ క్రమంలో అడివి శేష్ స్పందించారు.

    Also Read: Megastar Chiranjeevi- Akkineni Akhil: మెగాస్టార్ చిరంజీవి తో యుద్దానికి సిద్దమైన అక్కినేని అఖిల్

    నేను యూఎస్ లో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆమె నన్ను విడిచి వెళ్లిపోయింది. నా బర్త్ డే నాడు ఆ అమ్మాయి వివాహం జరిగింది. ఆ సంఘటన బాగా హర్ట్ చేసింది. అప్పటి నుండి నేను పెళ్లిపై దృష్టి పెట్టలేకపోతున్నాను. పేరెంట్స్ మాత్రం ఈ విషయంలో బాగా ఒత్తిడి చేస్తున్నారు.. అంటూ ఆయన చెప్పుకొచ్చారు. లవ్ ఫెయిల్యూర్ కారణంగా పెళ్లి పైకి మనసు మళ్లడం లేదని అడివి శేష్ మాటలు వింటే అర్థమవుతుంది.

    Adivi Sesh

    సినిమాపై ఆసక్తితో ఇండియాకు వచ్చిన అడివి శేష్ సొంతం మూవీలో ఓ చిన్న పాత్ర చేశారు. అనంతరం 2010లో హీరోగా కర్మ టైటిల్ తో మూవీ చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు అడివి శేష్ కావడం విశేషం. ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో స్టార్ హీరోల చిత్రాల్లో విలన్ రోల్స్ కూడా చేశారు. క్షణం మూవీతో అడివి శేష్ కి బ్రేక్ వచ్చింది. సస్పెన్సు థ్రిల్లర్ గా విడుదలైన క్షణం మంచి విజయాన్ని అందుకుంది. అలాగే గూఢచారి, ఎవరు చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టారు. ఎవరు మూవీ భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ మేజర్ తో అడివి శేష్ ఇమేజ్ మరో స్థాయికి చేరింది.

    Also Read:Virata Parvam Collections: విరాటపర్వం 3 రోజుల వసూళ్లు..రానా కి మరో బిగ్ షాక్

    Tags