https://oktelugu.com/

మే 7 నుంచి స్వదేసాగమనం!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని మే 7 నుంచి స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. వారిని దశల వారీగా స్వదేశానికి తీసుకొస్తామని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇందుకోసం 64 విమానాలును నడపాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మే 7 నుంచి 13 వరకు మొత్తం 12 దేశాల్లోని దాదాపు 14,800 మంది భారతీయుల్ని వెనక్కి తీసుకురానున్నట్లు ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 5, 2020 7:07 pm
    Follow us on

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని మే 7 నుంచి స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. వారిని దశల వారీగా స్వదేశానికి తీసుకొస్తామని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇందుకోసం 64 విమానాలును నడపాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మే 7 నుంచి 13 వరకు మొత్తం 12 దేశాల్లోని దాదాపు 14,800 మంది భారతీయుల్ని వెనక్కి తీసుకురానున్నట్లు ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. యుఎయి, యుకె, అమెరికా, ఖతార్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌, మలేషియా, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, బెహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌ వంటి 12 దేశాలకు భారత విమాన సంస్థలు ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థలను నడపనున్నారు. అయితే భారతీయులను దేశానికి తీసుకొచ్చిన తరువాత వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌ సౌకర్యాలను రాష్ట్రాలే ఏర్పాటు చేసుకోవాలని, ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కేంద్రం పేర్కొంది.

    మొత్తం 64 విమానాల్లో 10 విమానాలు యూఏఈ నుంచి,  అమెరికా, యూకేల నుంచి 14(7+7) రానున్నాయని పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. అదే విధంగా ఐదు విమానాలు సౌదీ అరేబియా నుంచి, ఐదు విమానాలు సింగపూర్, రెండు విమానాలు ఖతర్ నుంచి బయలుదేరతాయన్నారు. బంగ్లాదేశ్, మలేషియాల నుంచి 14(7+7) విమానాలు, కువైట్, ఫిలిప్పీన్స్ నుంచి 10 (5+5)విమానాలు, నాలుగు విమానాలు (2+2) ఒమన్, బహ్రెయిన్ నుంచి వస్తాయన్నారు.

    కాగా.. ప్రస్తుతానికి ప్రభుత్వ ఎయిర్‌ లైన్స్ మాత్రమే నడుస్తాయని.. మే 13వ తేదీ నుంచి ప్రైవేటు విమానాలు ప్రవాసులను తీసుకొస్తాయన్నారు. మరోపక్క విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారు విమాన టికెట్ చార్జీలను వారే భరించాలని హర్దీప్ స్పష్టం చేశారు. లండన్ నుంచి ఢిల్లీకి రానున్న విమాన టికెట్ చార్జీ రూ. 50 వేలు అని, ధాకా నుంచి ఢిల్లీకి వచ్చే విమాన టికెట్ చార్జీ రూ. 12 వేలు అని ఆయన తెలిపారు. భారత్‌కు వచ్చిన ప్రవాసులకు స్క్రీనింగ్ జరుగుతుందని.. అనంతరం 14 రోజుల పాటు క్వారంటైన్‌ లో ఉండాలని పేర్కొన్నారు.