మనదేశం నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఏటా వేలాది మంది వివిధ ఉద్యోగాల కోసం అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, అబుదాబి, కెనడా, నెదర్లాండ్, ఇండోనేషియా లాంటి దేశాలకు వెళుతున్నారు. దీంతో అక్కడ రూ. లక్షలు సంపాదిస్తున్నారు. సంపాదించిన దాంట్లో నుంచి కొంత మొత్తాన్ని ఇండియాలో ఉన్న తమ వారి కోసం పంపిస్తున్నారు. విదేశాల నుంచి పంపే మొత్తం కూడా విస్తుపోయే విధంగా ఉంటోంది. ఏకంగా ఏడాదిలో రూ. 6 లక్షల కోట్లు పంపుతున్నారని తేలింది. ఈ మొత్తాన్ని చూస్తే విస్తుపోయే విధంగా ఉంది. మన దేశ బడ్జెట్ సైతం ఇంతకు మించి ఉండడం లేదు. ఈ నేపథ్యంలో విదేశీ ద్రవ్యంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
అమెరికా నుంచే..
మన దేశానికిలో పెద్ద మొత్తం అమెరికా నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ స్థాయిల్లో ఉద్యోగాల కోసం వెళుతున్న మన వారు పెద్ద మొత్తంలో సంపాదిస్తూ తమ అవసరాలకు ఉంచుకుని మిగతా మొత్తాన్ని తమ వారికి పంపిస్తున్నారు. ఆ డబ్బుతో ఇండియాలో ఆస్తులు, భూములు కొనుగోలు చేస్తున్నారు. జీవితంలో సంపాదించినదంతా ఇక్కడకు పంపుకుని తరువాత వచ్చి హాయిగా కాలం గడిపేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అమెరికా తరువాత యూఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాలున్నాయి.
పెద్ద మొత్తంలో పంపేవాళ్లు..
విదేశాల నుంచి డబ్బు పంపే వారిలో మన దేశం వారే ఎక్కువగా ఉన్నారు. సంపాదనలో కూడా మన వారే పైచేయి సాధిస్తున్నారు. దీంతో దాచుకోవడానికి ప్రాధాన్యమిచ్చి ఇండియాలో ఉండే బంధువులకు పంపుతున్నారు. దీంతో వారు పొలాలు, స్థలాలు కొనుగోలు చేసి తమ వారి కోసం సిద్ధంగా ఉంచుతున్నారు.
ఆశ్చర్యపోయేలా?
ఒక సంవత్సరంలో సుమారు రూ. 6 లక్షల కోట్లు పంపడం ఆశ్చర్యకరం. దీంతో రోజు వారీగా లెక్కలు వేస్తే ఒక్క రోజుకు సుమారు రూ. 1670 కోట్లు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో నగదు పంపే భారతీయులు ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపుతున్నారు.
భారతే నెంబర్ వన్
సంపాదనలో కూడా భారతదేశం తన ప్రఖ్యాతిని చాటుకుంటోంది. ఏటా నగదు నిల్వలు పంపుతూ విదేశాల్లో ఉన్న వారు తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. అందరికంటే ఎక్కువగా సంపాదిస్తూ తామేమిటో నిరూపించుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థల ఎదుగుదలకు బాటలు వేస్తున్నారు. ఫలితంగా తమ మేథోశక్తిని పెంచుకుంటూ సంపాదన కూడా ఇనుమడించేలా చేస్తున్నారు.