Indian Army in Northeast frontier: భారత ప్రభుత్వం హఠాత్తుగా సైన్యాన్ని త్రిపుర, మిజోరాం వైపు తరలిస్తోంది. వాస్తవంగా ఈ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు లేదు. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక కార్యకలాపాలు వేగవంతం చేస్తోంది. 1971 యుద్ధంలో అగర్తల భారత కేంద్రంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహాయం చేసినట్లుగా ఇప్పుడు కొత్త పరిణామాలు సూచిస్తున్నాయి. బంగ్లాదేశ్ చిట్టగాంగ్ హిల్ ట్రాక్‌లో జరుగుతున్న ఘర్షణలు ఇందుకు కారణం.
గిరిజనుల కేంద్రంగా చిట్టగాంగ్ హిల్ ట్రాక్..
బంగ్లాదేశ్ మైదానాల మధ్య చిట్టగాంగ్ హిల్ ట్రాక్ కొండలు, అడవులతో భారత్ (మిజోరాం, త్రిపుర), బర్మాను వేరుచేస్తుంది. ఇక్కడ 13 గిరిజన తెగలు (జోమా పీపుల్) బుద్ధిస్టులు, హిందువులు, క్రై స్తవులుగా ఉన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లిం స్థిరనివాసులను పెంచి గిరిజనుల సంఖ్యను తగ్గించాయి. కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్ (కేఎన్‌ఎఫ్) ఏడాదిన్నరగా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో పోరాడుతోంది. ఈ ప్రాంతం దేశ భూభాగంలో 20–25% ఉంటుంది, చిట్టగాంగ్ పోర్టు కీలకం.
శరణార్థులకు ఆశ్రయం..
ఘర్షణల వల్ల గిరిజనులు మిజోరాం, త్రిపురలోకి ప్రవేశిస్తున్నారు. భారత్ వారికి పునరావాసం, మానవీయ సహాయం అందిస్తోంది. గూఢచార సంస్థలు బంగ్లాదేశ్‌లో శరణార్థులతో చర్చలు జరిపాయి. బంగ్లాదేశ్ భారత్ ఆయుధాలు, శిక్షణ ఇస్తోందని అనుమానిస్తోంది.
పాక్–బంగ్లా కుట్రలు
1971 ముందు ఆగస్టు 15న చిట్టగాంగ్‌లో త్రివర్ణ పతాకం ఎగిరింది. పాకిస్తాన్ ఆక్రమించి ముస్లింలను స్థిరపరిచింది. 1969 కప్తా డ్యాం గిరిజనులను తరిమేసింది. ఈ చరిత్ర మధ్య భారత్ 1971లో అగర్తల నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్య్రానికి సహకరించింది.
చికెన్ నెక్‌పై పట్టుకోసం..
చిట్టగాంగ్ హిల్ ట్రాక్ భారత్‌లోని రెండు, బర్మాలోని రెండు ప్రాంతాలతో లింక్. దీన్ని ఉపయోగించుకుంటే చికెన్ నెక్‌పై ఒత్తిడి తగ్గుతుంది. కేఎన్‌ఎఫ్ గెరిల్లా దాడులు బంగ్లాదేశ్ సైన్యాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. భారత మద్దతు, బర్మా ఉగ్రవాదుల సహకారం అనుమానాలు పెరుగుతున్నాయి.
మహ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాక హిందువులపై 2,900 దాడులు జరిగాయి. చిట్టగాంగ్ పోర్టు, భూభాగ నష్ట ప్రమాదం బంగ్లాదేశ్‌ను భయపెడుతోంది. భారత సైన్య మోహరాయనం దీన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. బంగ్లాదేశ్ భారత్‌ను నిందించకపోయినా ఆందోళన వ్యక్తం చేస్తోంది.