Anaganaga Oka Raju 2 Days Collections: నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరో గా నటించిన ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతి కానుకగా విడుదలై, మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతుంది. ట్రైలర్ ని చూసినప్పుడే మనకు ఈ సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అనేది అర్థం అయిపోయింది. కానీ నవీన్ పోలిశెట్టి కి యూత్ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉండడంతో ఈ సినిమాకు రెండు వైపుల నుండి ఆదరణ లభిస్తోంది. నవీన్ పోలిశెట్టి కి వరుసగా ఉన్న హిట్స్ కారణంగా ఈ చిత్రానికి విడుదలకు ముందే 28 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. విడుదలైన రెండు రోజులకు ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి?, ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం.
నైజాం ప్రాంతం లో రెండు రోజులకు గాను 3 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 1 కోటి 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 1 కోటి 42 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సీడెడ్ ప్రాంతం కంటే ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ చిత్రానికి ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం. చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక గుంటూరు నుండి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, కృష్ణా జిల్లా నుండి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా నుండి 1 కోటి రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 68 లక్షల రూపాయిలు ఈ చిత్రానికి వచ్చాయి. ఇక నెల్లూరు జిల్లా నుండి 42 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి, రెండు రోజుల్లో ఈ చిత్రానికి 9 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ చిత్రానికి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి ఏకంగా 3 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికిఇ 13 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే దాదాపుగా 50 శాతం రికవరీ అన్నమాట. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకో 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. మొదటి వారం లోనే ఈ మార్కుని అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.