Homeఅంతర్జాతీయంIndia Vs Pakistan: పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్.. దెబ్బకు ఫ్యూజులు ఔట్

India Vs Pakistan: పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్.. దెబ్బకు ఫ్యూజులు ఔట్

India Vs Pakistan: భారత సైన్యం పశ్చిమ సరిహద్దుల్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ (EW) వ్యవస్థలను మోహరించి, పాకిస్థాన్‌ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్‌ మిసైళ్ల సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తోంది. ఈ వ్యవస్థలు గ్లోబల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (GNSS) సిగ్నల్స్‌ను జామ్‌ చేస్తూ, పాక్‌ సైన్యం లక్ష్యాలను గుర్తించడంలో గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ చర్యలు భారత్‌కు యుద్ధ రంగంలో వ్యూహాత్మక ఆధిపత్యాన్ని అందిస్తున్నాయి.

Also Read: భారత్‌–పాక్‌ ఉద్రిక్తతలు.. ఐఎస్‌ఐ చీఫ్‌కు కీలక బాధ్యతలు!

పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడి తర్వాత భారత్‌ పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడి వెనుక పాకిస్థాన్‌ ఉన్నట్లు భారత్‌ గుర్తించింది. దీంతో దౌత్య సంబంధాలను తెంచుంది. అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు ప్రధాని మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ తరుణంలో పాకిస్థాన్‌ కూడా భారత కదలికలను గమనిస్తోంది. ఇందుకు నిఘా వ్యవస్థను ఉపయోగిస్తోంది. అయితే భారత్‌ పాకిస్థాన్‌ నిఘా వ్యవస్థ కళ్లకు గంతలు కడుతోంది.
2024 సెంటర్‌ ఫర్‌ ల్యాండ్‌ వార్ఫేర్‌ స్టడీస్‌ నివేదిక ప్రకారం, భారత సైన్యం వద్ద సుమారు 50 అత్యాధునిక ఉగి వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. ఇవి GPS (అమెరికా), GLONA(రష్యా), BeiDou(చైనా) వంటి నేవిగేషన్‌ వ్యవస్థల సిగ్నల్స్‌ను సమర్థవంతంగా అడ్డుకుంటాయి. ఈ వ్యవస్థలు పాక్‌ సైనిక విమానాలు, డ్రోన్లు, మిసైళ్లు లక్ష్యాలను గుర్తించకుండా చేస్తాయి, దీంతో యుద్ధ రంగంలో పాక్‌ సైన్యం సమాచార గందరగోళంలో చిక్కుకుంటుంది.

యుద్ధ విమానాల్లో..
భారత వాయుసేన రఫేల్‌ యుద్ధ విమానాల్లోని SPECTRA (Self-Protection Equipment to Counter Threats for Rafale Aircraft) సూట్స్‌ కూడా శత్రు రాడార్, నేవిగేషన్‌ సిగ్నల్స్‌ను జామ్‌ చేయగలవు. అదేవిధంగా, భారత నావికాదళం వినియోగించే శక్తి ఉగి సిస్టమ్స్‌ సముద్ర రంగంలో శత్రు నేవిగేషన్‌ను అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ వ్యవస్థలు భారత సైన్యానికి బహుముఖ రక్షణ, దాడి సామర్థ్యాలను అందిస్తున్నాయి.

పాకిస్థాన్‌ EW సామర్థ్యాలు..
పాకిస్థాన్‌ వద్ద సొంతంగా తయారు చేసిన EW వ్యవస్థలు లేవు. ఇది చైనా నుంచి దిగుమతి చేసుకున్న DWL–002, Zarba Coastea EW సిస్టమ్స్‌తో పాటు కమర్షియల్‌ జామర్‌లపై ఆధారపడుతోంది. అయితే, ఈ వ్యవస్థలు భారత్‌కు వ్యతిరేకంగా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. భారత EW వ్యవస్థల బలమైన జామింగ్‌ సామర్థ్యం ముందు పాక్‌ సిస్టమ్స్‌ బలహీనంగా ఉన్నాయి. ఫలితంగా, పాక్‌ సైన్యం యుద్ధ రంగంలో సమర్థవంతమైన ప్రతిస్పందనను అందించలేకపోతోంది.

భారత్‌ చర్యల ప్రభావం..
పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, భారత్‌ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ ఘటనకు ప్రతిస్పందనగా, భారత్‌ ఏప్రిల్‌ 30 నుంచి మే 23 వరకు పాక్‌ సైనిక, పౌర, రవాణా విమానాలకు నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌ (NOTAM) జారీ చేసింది. దీంతో పాకిస్థాన్‌ తన విమానాలను భారత గగనతలం మీదుగా కాకుండా చైనా, శ్రీలంక వంటి దేశాల గగనతలాల మీదుగా మళ్లించింది. ఈ చర్య పాక్‌ విమానయాన రంగంపై గణనీయమైన ఆర్థిక, లాజిస్టిక్‌ ఒత్తిడిని కలిగించింది. పాకిస్థాన్‌ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసినప్పటికీ, భారత
EW వ్యవస్థల జామింగ్‌ సామర్థ్యం కారణంగా దాని సైనిక, పౌర నేవిగేషన్‌ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితి సరిహద్దు ప్రాంతంలో రోజువారీ కార్యకలాపాలను కూడా దెబ్బతీస్తోంది.

భారత్‌ బహుముఖ ఆధిపత్యం
భారత్‌ EW వ్యవస్థల మోహరింపు ద్వారా యుద్ధ రంగంలో బహుముఖ ఆధిపత్యాన్ని సాధిస్తోంది. ఈ వ్యవస్థలు సైనిక లక్ష్యాలతో పాటు, శత్రు దేశం యొక్క రవాణా, సమాచార వ్యవస్థలను కూడా దెబ్బతీస్తాయి. ఉదాహరణకు, రఫేల్‌ విమానాల్లోని PECTRA సూట్స్‌ శత్రు రాడార్‌లను గుర్తించి, వాటిని తప్పుదారి పట్టించగలవు. అదేవిధంగా, నావికాదళం శక్తి సిస్టమ్స్‌ సముద్ర రంగంలో శత్రు నౌకల నేవిగేషన్‌ను అడ్డుకుంటాయి. అదనంగా, భారత్‌ ఇటీవల కొత్తగా అభివృద్ధి చేసిన DRDO రూపొందించిన ‘సమ్యుక్త’ ఉగి సిస్టమ్‌ను కూడా మోహరించింది. ఈ సిస్టమ్‌ బహుళ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో సిగ్నల్స్‌ను జామ్‌ చేయగలదు, ఇది పాక్‌ సైన్యం ఉపయోగించే ఆధునిక కమ్యూనికేషన్‌ వ్యవస్థలను కూడా అడ్డుకుంటుంది.

భారత సైన్యం అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థలు పాకిస్థాన్‌ సైనిక సామర్థ్యాలను గణనీయంగా బలహీనపరుస్తున్నాయి. ఈ వ్యవస్థలు శత్రు నేవిగేషన్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను అడ్డుకోవడం ద్వారా యుద్ధ రంగంలో భారత్‌కు వ్యూహాత్మక ఆధిపత్యాన్ని అందిస్తున్నాయి. పాకిస్థాన్‌ పరిమిత EW సామర్థ్యాలు, భారత్‌ చర్యల ముందు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి.

Also Read: అమరావతి వేదికగా.. రూ.లక్ష కోట్ల నిర్మాణాలకు ప్రధాని శ్రీకారం!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version