Chiranjeevi and Anil Ravipudi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళు సాధిస్తున్న విజయాలను చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో చిరంజీవి (Chiranjeevi) లాంటి స్టార్ హీరో సైతం ఈ ఏజ్ లో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమా ఇప్పటివరకు మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండగా ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో చేయబోతున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమాని సూపర్ డూపర్ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన భారీ కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సినిమాని జూన్ లో స్టార్ట్ చేసి జనవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనే దాని మీదనే ప్రతి ఒక్కరి దృష్టి అయితే ఉంది. ఇక అనిల్ రావిపూడి ఇప్పటివరకు చేసిన ఎనిమిది సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమం గ్యారంటీ సినిమాగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
కాబట్టి ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకొని తన కంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లాంటి హీరో సైతం ఈ ఏజ్ లో మంచి సినిమాను అతని అభిమానులకు అందించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలన్ని చాలా గొప్ప విజయాలే కావడం విశేషం…ఇక ఇదిలా ఉంటే కమర్షియల్ సినిమాలను చాలా ఎక్స్ట్రాడినరీకి తెరకెక్కించగలిగే అనిల్ రావిపూడి ఈ సినిమాని సైతం కమర్షియల్ ఎలిమెంట్స్ తో నింపేయడమే కాకుండా ఇందులో రామ్ చరణ్ తో ఒక క్యారెక్టర్ ని కూడా చేయించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఈ సినిమా మీద హైప్ తీసుకురావడానికి కూడా రామ్ చరణ్ ను ఇందులో భాగం చేస్తున్నారట. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు. తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనిల్ రావిపూడి ఈ సినిమాతో మెగాస్టార్ కి భారీ సక్సెస్ ని కట్టబెడతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?