https://oktelugu.com/

India Today Survey In AP: ఇండియా టుడే- సీ ఓటర్ సర్వే ఏపీ ఫలితాలను అడ్డుకున్నారా?

వాస్తవానికి ప్రతి 6, మూడు నెలలకు ఒకసారి ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్ పేరుతో ఒపీనియన్ పోల్ ప్రకటిస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఫలితాలను ఇందులో వెల్లడిస్తుంటారు.

Written By: , Updated On : August 28, 2023 / 09:08 AM IST
India Today Survey In AP

India Today Survey In AP

Follow us on

India Today Survey In AP: ఇండియా టుడే సర్వే వెల్లడి కాకుండా అడ్డుకున్నారా? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఫలితాలు వెల్లడించిన సదరు సంస్థ ఏపీ విషయంలో ఎందుకు మౌనం దాల్చింది? ఎవరి నుంచైనా ఒత్తిడి ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపి 15 లోక్సభ స్థానాల్లో గెలుపొందుతుందని ఈ సర్వే వెల్లడించినట్లు ఎల్లో మీడియా చెబుతోంది. అయితే అసలు సర్వే వెల్లడి కాకుండానే టిడిపి అనుకూల మీడియా అతి చేస్తోందని వైసిపి వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. దీంతో అసలు ఏం జరుగుతోందని ఏపీ ప్రజల్లో అయోమయం నెలకొంది.

వాస్తవానికి ప్రతి 6, మూడు నెలలకు ఒకసారి ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్ పేరుతో ఒపీనియన్ పోల్ ప్రకటిస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఫలితాలను ఇందులో వెల్లడిస్తుంటారు. గత ఏడాది ఆగస్టులో ఏపీలో సర్వే కి సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఏడు స్థానాలు కట్టబెట్టారు. ఈ ఏడాది జనవరిలో 10 సీట్లు వస్తాయని తేల్చారు. కానీ తాజా సర్వే మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఈ షో ను రన్ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయి నోరు మెదపకపోవడం విశేషం.

అయితే టిడిపి ప్రచారం చేసుకున్నట్లు 15 లోక్సభ స్థానాల విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే… సర్వే ఫలితాలు వెల్లడిలో చర్చ నడిచింది. ఎన్డీఏ బలం ప్రస్తావనకు వచ్చినప్పుడు సి ఓ టర్ చీఫ్ యశ్వంత్ దేశ్ముఖ్ అన్యాపదేశంగా టిడిపి ప్రస్తావన తీసుకువచ్చారు. 15 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం ఉందని నోరు జారారు. అప్పుడే రాజ్దీప్ సర్దేశాయి టాపిక్ను డైవర్ట్ చేశారు. కానీ ఎక్కడా అధికారికంగా ఏపీలో తెలుగుదేశం పార్టీకి 15 లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పలేదు. సీ ఓటర్ సంస్థ చీఫ్ నుంచి ఆ మాట వచ్చేసరికి ఎల్లో మీడియా దానినే పట్టుకుంది. టిడిపికి అనుకూలంగా ప్రచారం చేయడం ప్రారంభించింది.

అయితే ప్రతిసారి ఏపీ గురించి ప్రస్తావన తీసుకొచ్చే ఇండియా టుడే మూడ్ ఆఫ్ సర్వే ఈసారి మౌనం దాల్చడం పై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదంతా వైసిపి పనేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయస్థాయిలో సర్వేలను మేనేజ్ చేయడానికి వైసిపి ఓ టీం ఏర్పాటు చేస్తుందని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా సంస్థ సర్వే వేస్తుంది అంటే.. వాటిని ప్రభావితం చేయడం ఈ బృందం పని. ఇప్పటికే పెద్ద ఎత్తున సదరు సర్వే సంస్థలకు ప్రజాధనాన్ని ముట్ట చెప్పారు అన్న విమర్శ ఉంది. ఆ జాబితాలోనూ ఇండియా టుడే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒపీనియన్ పోల్ ముందుగానే వైసీపీ దృష్టికి వచ్చింది. టిడిపికి ఇచ్చే స్థానాలను వైసీపీకి కట్ట పెట్టాలని కోరినట్లు సమాచారం. అయితే సి ఓటర్ సంస్థ నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. తమ సమస్త విశ్వసనీయతను ఇలాంటివి ప్రశ్నార్ధకం చేస్తాయని సి ఓటర్ సంస్థ నిరాకరించింది. అందుకే మధ్యే మార్గంగా ఏపీ ఫలితాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది.