EU Pressure on India: మొన్న అమెరికా… నిన్న నాటో.. ఈరోజు యురోపియన్ యూనియన్(ఈయూ).. భారత్‌ను ఆంక్షల పేరుతో బెదిరిస్తున్నాయి. రష్యాను ఓడించలేక.. రష్యాతో సత్సంబంధాలు కలిగి ఉన్న దేశాలను ఇలా టార్గెట్ చేస్తున్నాయి. తద్వారా రష్యాను లక్ష్యంగా పెట్టుకున్నాయి.
సాధారణంగా ఏదైనా వస్తువు మార్కెట్‌లో దొరికే ధరకన్నా.. హోల్‌సేల్‌గా రూ.10 తక్కువకు ఇస్తామంటే ఎవరైనా.. హోల్‌సేల్‌గా కొనడానికే మొగ్గు చూపుతాం. ఇప్పుడు భారత్ కూడా ఇదే చేస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి కొనుగోలు చేసే ఆయిల్ కన్నా.. రష్యా ఆయిల్ మనకు తక్కువ ధరకు వస్తుంది. దీనికి కారణం.. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా అమెరికా, నాటో రష్యా ఆయిల్ ఎవరూ కొనుగోలు చేయవద్దని ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఆయిల్ కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ తరుణంలో మిత్రదేశమైన భారత్‌ను రష్యా సంప్రదించింది. తక్కువ ధరకు సరఫరా చేయడంతోపాటు, డాలర్లలో కాకుండా రూపాయల్లో ఇస్తామని తెలిపింది. దీంతో భారత్ కూడా మిత్ర దేశానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. దాదాపు మూడేళ్లుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది. ఈ ఆయల్‌ను భారత్ ఇతర దేశాలకు విక్రియస్తోంది. దీంతో మనకు నాలుగు రూపాయల లాభమే కలుగుతుంది. అయితే రష్యా ఆయిల్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఆయుధాలు తయారు చేసి ఉక్రెయిన్‌పై దాడులు చేస్తుందని యురోపియన్ యూనియర్ ఆరోపిస్తోంది. అందుకే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపైనా ఆంక్షలు విధిస్తామంటోంది.
Also Read: టాటా పరువు తీస్తున్న టాప్ కంపెనీ.. రెండ్రోజుల్లో రెండు ప్రమాదాలు
ప్రైజ్ క్యాప్..
ఈయూ.. తన ఆంక్షల్లో భాగంగా ఇప్పటి వరకు రష్యా ఆయిల్ ధరను 60 డాలర్లుగా నిర్ణయించింది. తాజా ఆంక్షల్లో భాగంగా ఆయిల్ ధరను 47.5 డాలర్లకు తగ్గించింది. ఇది రష్యాకు ఇబ్బందికరమే. కానీ, భారత్‌కు లాభమే. భారత్ ఈ ఆయిల్‌ను రిఫైనరీ చేసి అవసరం ఉన్న దేశాలకు విక్రియస్తోంది. తద్వారా భారత్ ఇటు కొనుగోలు దేశాలు.. అటు రష్యా నుంచి లాభం పొందుతోంది. అయితే ఈయూ ఆయిల్ ధర తగ్గించగా, అమెరికా.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై 100 నుంచి 500 శాతం టారిఫ్ విధిస్తామని బెదిరిస్తోంది. దీంతో భారత్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది.
Also Read: అమెరికాలో ‘ఐటీ’ బతుకు.. ఎంత దుర్భరం అంటే?
దీటుగా స్పందించిన భారత్..
ఈయూ, రష్యా హెచ్చరికలు, ఆంక్షల బెదిరింపుల నేపథ్యంలో ఇప్పుడు భారత్ కూడా దీటుగా స్పందించింది. ప్రస్తుతం తాము 27 దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని, దీనిని అవసరమైతే 47 దేశాలకు పెంచుతామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో తక్కువ ధరకు దొరుకుతున్న ఆయిల్ కొనుగోలు చేసే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయవద్దని ఆంక్షలు విధించే అధికారం ఎవరికీ లేదని తెలిపింది. రష్యా నుంచి కొనగోలు చేసిన ఆయిల్‌ను తాము ఆఫ్రికా దేశాలకు అమ్ముతామని, యురోపియన్ యూనియన్ దేశాలకు విక్రయించబోమని క్లారిటీ ఇచ్చింది.
మొత్తంగా ఇంతకాలం అమెరికా ఆంక్షలకు భయపడిన భారత్.. ఇప్పుడు దేనికైనా రెడీ అంటోంది. ఆర్థికంగా భారత్‌కు లబ్ధి కలగాలని చూస్తోంది.