Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Independence Day Celebrations: స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై కూటమి షాకింగ్ డెసిషన్!

Amaravati Independence Day Celebrations: స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై కూటమి షాకింగ్ డెసిషన్!

Amaravati Independence Day Celebrations: కూటమి ప్రభుత్వం( alliance government ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేదికను ఖరారు చేసింది. సాధారణంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాజధాని ప్రాంతంలో నిర్వహించడం సంప్రదాయం. అయితే విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతి పనులు మొదలుపెట్టారు. అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అనువైన ప్రాంతం లేకపోవడంతో ఏటా విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తూ వచ్చారు. 2014 నుంచి 2019 వరకు అధికారం చేపట్టిన టిడిపి.. 2019 నుంచి 2024 మధ్య అధికారం చేపట్టిన వైయస్సార్ కాంగ్రెస్.. అక్కడే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాయి. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం వేదికను మార్చనుంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: కంచుకోటలు’గా ఆ రెండు నియోజకవర్గాలు!

 శరవేగంగా పనులు..
అమరావతి రాజధాని( Amaravathi capital ) పనులు ప్రారంభమయ్యాయి. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణ పనులను ఒక కొలిక్కి తేవాలని సీఎం చంద్రబాబు గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం వేలాదిమంది కార్మికులు, సిబ్బంది, అధికారులు అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలకు అమరావతిలో కేటాయించిన భూముల్లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలో ఉత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2028 నాటికి రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు.

 అమరావతి వేదికగా వేడుకలు..
అయితే రాజధాని నిర్మాణ సంకేతాలను ప్రపంచవ్యాప్తంగా వినిపించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి అమరావతి లోనే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను( Independence Day celebrations ) నిర్వహించాలని భావిస్తోంది. సచివాలయం వెనుక భాగంలో ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. తద్వారా అమరావతి రాజధాని నిర్మాణ ప్రాధాన్యతను, దాని ఆవశ్యకతను ప్రజలకు చాటి చెప్పేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. ఇదే వేదిక నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి పథకాన్ని ప్రారంభించనున్నారు. అమరావతి వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు సీఎం చంద్రబాబు. దీనిని ఒక వేడుకగా జరపాలని భావిస్తున్నారు. మూడు పార్టీలు ఉమ్మడిగా.. కనువిందు చేసేలా నాయకులు ఈ వేదికపై కనబడనున్నారు. మొత్తానికి అయితే రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ల తర్వాత అమరావతి రాజధానిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం నిజంగా శుభ పరిణామం. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular