AK-203 rifles: భారత్ అమ్ములపొదిలోకి శక్తిమంతమైన ఆయుధాలు రాబోతున్నాయి. ఏకే-203 రైఫిల్స్‌ను రష్యా దేశ టెక్నాలజీ సాయంతో భారత్ తయారు చేసుకోబోతున్నది. ఇప్పటి వరకు ఇండియా ఇన్సాస్ రైఫిళ్లను ఉపయోగించింది. ఈ రైఫిల్స్‌తో భారత్ ఇంకా శక్తిమంతమైన దేశంగా అవతరించనుంది. శత్రువుపై దాడి చేసే క్రమంలో భారత్‌కు ఈ ఆయుధాలు ఉపయోగపడతాయి. ఈ పవర్ ఫుల్ ఏకే-203 రైఫిల్స్‌పై ఫోకస్..

చాలా కాలం నుంచి అనగా 30 ఏళ్ల నుంచి భారత సైన్యం ఇన్సాస్ రైఫిళ్లను ఉపయోగిస్తోంది. వీటి ప్లేస్‌లో 6 లక్షల ఏకే-203 రైఫిల్స్ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇన్సాస్ రైఫిల్స్ కంటే చాలా పవర్ ఫుల్‌గా ఉండే ఈ వెపన్స్ ద్వారా భారత సైన్యం ఇంకా బాగా పని చేయగలదు. ఈ రైఫిల్స్ భారత్‌లో తయారు చేసేందుకు అవసరమైన టెక్నాలజీ సాయం చేస్తామని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమర్ పుతిన్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య రక్షణకు సంబంధించిన విషయాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో భారత్‌కు పవర్ ఫుల్ ఏకే-203 రైఫిల్స్ తయారీ విషయంలో సహకారంపై ఓకే చెప్పారు.
ఇన్సాస్ రైఫిల్స్ కంటే ఏకే-203 రైఫిల్స్ వెయిట్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఇన్సాస్ రైఫిల్ 4.15 కేజీల వెయిట్ ఉండగా, ఏకే-203 రైఫిల్స్ 4.15 కేజీస్ వెయిట్ ఉంటుంది. ఇక ఈ ఏకే రైఫిల్ 300 మీటర్ల డిస్టెన్స్‌లో ఉండే టార్గెట్‌ను ఈజీగా ఛేదించగలుగుతుంది. అలా శత్రువుపై ఏకే వేగంగా దాడి చేయగలదు. ఈ రైఫిల్స్ తయారీకి భారత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ సమీపంలోని కోర్వాలో యూనిట్ నెలకొల్పింది. ఇది భారత్, రష్యా జాయింట్ వెంచర్. కాగా, ఇక్కడ శక్తిమంతమైన ఏకే రైఫిల్స్ తయారు కానున్నాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ రైఫిల్స్ తయారు చేయనున్నారు. ఇందుకు రష్యా దేశం సహకరించనుంది.
Also Read: BJP: మిషన్-2023.. బీజేపీలోకి ఉద్యమ నేతలు.. చేరికలతో బీజీబీజీ..!
ఈ ఆయుధాల తయారీకి అవసరమైన టెక్నాలజీ అందించేందుకు రష్యా అంగీకరించింది. టెక్నాలజీ అందించినందుకు భారత్ రష్యాకు రాయల్టీ చెల్లింపు మాఫీ చేయబోతుంది. ఇందుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ రూ.5 వేల కోట్లకు పైనే ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకే భారత్ ఈ విధమైన అడుగులు వేసింది. అధునాతనమైన, శక్తిమంతమైన ఆయుధాలు, యుద్ధ సామగ్రి ఉంటేనే భారత సైన్యం శత్రువును అతి తక్కువ సమయంలో మట్టుబెట్టగలదు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం రైఫిల్స్ తయారీకి ఒప్పందం చేసుకుంది.
Also Read: Mamata Banerjee: మమతా బెనర్జీ నేతృత్వంలోనే మూడో కూటమి ఏర్పాటు జరిగేనా?