Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. ఈ ప్రాజెక్టు ఇక పూర్తవుతుందనుకుంటున్న ప్రజలకు నిరాశే ఎదురవుతున్నది. పనులు నత్తనడకన సాగుతుండటం, ప్రస్తుతం జరుగుతున్న పనుల తీరు చూస్తుంటే ఇంకా ప్రాజెక్టు నిర్మాణం చాలా దూరంలో ఉందనిపిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ, అప్పటి లోగా ప్రాజెక్టు ఏ మేరకు పూర్తి అవుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది, ప్రాజెక్టు సవరించిన అంచానాలేంటనే విషయాలపై స్పెషల్ ఫోకస్..
పోలవరం ప్రాజెక్టు నిజానికి వచ్చే ఏడాది అనగా 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కానీ, ప్రజెంట్ జరుగుతున్న వర్క్స్‌ను చూస్తుంటే అది అప్పటి వరకు పూర్తయ్యేలా లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే కొత్త షెడ్యూల్‌ను సూచించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీకి అందిన రిపోర్ట్స్ ప్రకారం ఈ విషయాలు స్పష్టమవుతున్నాయి. సవరించిన అంచనాల ప్రకారం.. అప్పటి లెక్కలు అనగా 2017-18 ధరల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.35,950.16 కోట్లు ఖర్చు అవుతాయి.
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలపైన కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడూ ఇటీవల రాజ్యసభలో వివరించారు. 2019 ఫిబ్రవరిలో జల్ శక్తి శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగిందని, ఇందులో రివైజ్డ్ కాస్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారని, దాని ప్రకారం రూ.35, 950.16 కోట్లు ఖర్చు విభజించినట్లు తెలిపారు. వీటి కోసం గాను పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పెట్టుబడుల పర్మిషన్ తీసుకోవాలి. ఏపీ రాష్ట్రసర్కారు చేసిన ఖర్చుల బిల్లులు అందగానే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సీడబ్ల్యూసీ సిఫార్సులు తీసుకుని అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ పర్మిషన్‌తో పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు చెల్లిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
Also Read: సీఎం జగన్‌ను హెచ్చరిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ..!
పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.11,600 కోట్లు ఇచ్చినట్లు, ఇటీవల పీపీఏ, సీడబ్ల్యూసీలు రూ.711.60 కోట్లు చెల్లించాలని సిఫార్సు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి వివిధ కారణాలు ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కొవిడ్ మహమ్మారి ప్రభావం వలన కొంత కాలం పాటు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయన్నారు. పునరావాస కార్యక్రమాల ప్రభావం కూడా పోలవరం ప్రాజెక్టుపై పడింది. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొద్ది కాలం పాటు అలానే ఆగిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని గురించి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మంత్‌వైజ్ సెండ్ చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఆ ప్రకారంగా పనుల పురోగతి కరోనా మహమ్మారి , ఇతర కారణాల వలన ఆలస్యమైంది. దాంతో నిర్దేశించుకున్న లక్ష్యం లోపల పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితులు అయితే కనబడటం లేదు.