Homeజాతీయ వార్తలుIndia security breach secrets sold: భారత్‌పై నిరంతర కుట్రలు.. రూ.500 కోసం మన రహస్యాలు...

India security breach secrets sold: భారత్‌పై నిరంతర కుట్రలు.. రూ.500 కోసం మన రహస్యాలు అమ్ముతున్న దుర్మార్గులు!

India security breach secrets sold: భారత దేశంపై నిరంతరం పెద్దపెద్ద కుట్రలు జరుగుతున్నాయి. వాటి నుంచి మన ధర్మం, దేవుడు కాపాడుతున్నాయి. నిరంతరం కుట్రలు ఎదుర్కొనే దేశం భారతే అనిపిస్తుంది. ఇటీవల రెండు భారీ కుట్రలు బట్టబయలయ్యాయి. ఒకటి ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టే అమెరికా–ఉక్రెయిన్‌ కుట్ర కాగా, మరొకటి పాకిస్తాన్‌–ఐఎస్‌ఐఎస్‌ కుట్ర.

ఈశాన్య రాష్ట్రాల విభజనకు అమెరికా ప్లాన్‌
ఇటీవలే అమెరికాకు చెందిన ఓ గూఢచారి మాథ్యూ ఆరోన్‌ వాన్‌డైక్, ఉక్రెయిన్‌కు చెందిన పెట్రో హుర్బా, స్లివియెక్‌ సెర్గీ, ఇతరులతో కలిసి భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టి, బంగ్లాదేశ్, మయన్మార్‌లో ఉన్న ప్రాంతాలతో కలిపి క్రై స్తవ దేశం ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. కొంతకాలంగా జరుగుతున్న ఈ కుట్రను ఎన్‌ఐఏ ఇటీవల ఛేదించింది. వీరందరూ పర్యాటక వీసాపై భారత్‌లోకి ప్రవేశించారు. అస్సాం, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్‌ వంటి రాష్ట్రాలను భారత్‌ నుంచి వేరు చేయడం వీరి లక్ష్యం. ఈ కొత్త దేశంలో అమెరికా సైనిక స్థావరం ఏర్పాటు చేసి, భారత్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్‌లపై నిఘా పెట్టడం ప్లాన్‌.

ఎన్‌ఐఏ చర్యలు..
అమెరికన్, ఆరుగురు ఉక్రెయిన్‌ పౌరులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. అమెరికా విడుదల చేయాలని కోరినా, భారత్‌ విడుదల చేయలేదు. 14 మంది ఉక్రేనియన్లు వేర్వేరు తేదీలలో పర్యాటక వీసాలపై భారత్‌లోకి ప్రవేశించారని అనుమానిస్తోంది. మిజోరాం మీదుగా మయన్మార్‌కు వెళ్లి, ఉగ్రవాద శిబిరాలను నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది

తాజాగా సీసీ కెమెరాలతో గూఢచర్యం..
ఇటీవల గజియాబాద్, సోనాపాట్‌ ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో దొరికిన సీసీ కెమెరాల వెనుక ఐఎస్‌ఐఎస్‌ కుట్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇవి ఐఎస్‌ఐతో లింక్‌ అయినట్లు గుర్తించారు. 22 మంది ఈ కుట్ర చేసినట్లు తాజాగా నిర్ధారణ అయింది. ఇందులో ఆరుగురు మైనర్లు ఉన్నారు.

కుట్ర అమలు ఇలా..
వీరు సోలార్‌తో పనిచేసే కెమెరాలను సైన్యం తిరిగే రూట్లలో అమర్చారు. కెమెరా ఫుటేజ్‌లు ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌ల ద్వారా పాకిస్తాన్‌కు పంపించారు. ఈ విజువల్స్‌ మన దేశంలో కనిపించవు, నేరుగా పాకిస్తాన్‌లో ఉన్నవారు మానిటర్‌ చేస్తారు. సోనాపాట్‌ వద్ద 50 స్పాట్లలో, జమ్మూలోని రైల్వే కారిడార్‌లో ఏర్పాటు చేశారు. వీరికి ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపు ఉంది, జీపీఎస్‌ కోఆర్డినేట్స్, ఫొటోలు, వీడియాలు, అక్షాంశాలు, రేఖాంశాలు పంపించారు

రూ.500 కోసం అమ్ముకన్నారు..
కేవలం రూ.500లకు కక్కుర్తి పడినవారు ఈ పనిచేసి, పాకిస్తాన్‌కు మన రహస్యాలు పంపుతుండడం విశేషం. ఈ చిన్న మొత్తం కోసం దేశ భద్రతను పణంగా పెట్టడం దుర్మార్గం.

భారతదేశంపై కుట్రలు నిరంతరం జరుగుతున్నాయి. అమెరికా, పాకిస్తాన్, ఐఎస్‌ఐఎస్‌ వంటి శక్తులు మన దేశాన్ని బలహీనపర్చాలని చూస్తున్నాయి. కానీ, మన ధర్మం, దేవుడు, భద్రతా దళాల చొరవ వల్ల ఈ కుట్రలు విఫలమవుతున్నాయి.

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే, వెంటనే భద్రతా దళాలకు సమాచారం ఇవ్వాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version