Homeఆంధ్రప్రదేశ్‌Increased security in Amaravati: అమరావతి లో ఏదో జరుగుతోంది... అందుకే నిఘా..

Increased security in Amaravati: అమరావతి లో ఏదో జరుగుతోంది… అందుకే నిఘా..

Increased security in Amaravati: అమరావతి పై ఫుల్ నిఘా పెట్టింది ఏపీ ప్రభుత్వం. వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో.. అనేక రకాల అనుమానాలు వచ్చిన తరుణంలో పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇటీవల కోట్లాది రూపాయల నిర్మాణ సామాగ్రి అగ్ని ప్రమాదాల్లో దగ్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఇది విద్రోహ చర్య అని ఎక్కువగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆది నుంచి అమరావతి అంటే ఒక రకమైన విష ప్రచారం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అమరావతి నిర్మాణ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇది మింగుడు పడనివారే ఇటువంటి దుశ్చర్యలకు దిగుతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. అమరావతిలో ఇన్వెస్టర్స్ ను గందరగోళపరిచేందుకు ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొన్ననే దీనిపై క్యాబినెట్లో చర్చించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అమరావతిలో జరుగుతున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అమరావతి పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

అమరావతి నిర్మాణంలో సి ఆర్ డి ఏ పాత్ర కీలకం. అయితే ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. నిరంతరం డ్రోన్ నిఘా, పోలీస్ పెట్రోలింగ్ ఉండేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. వేలాదిమంది అధికారుల పర్యవేక్షణలో కార్మికులు పనులు చేస్తున్నారు. ఎటు చూస్తున్నా వందల కోట్ల రూపాయల నిర్మాణ సామాగ్రి ఉంటుంది. వాటికి రక్షణ కవచంలా పోలీస్ శాఖ ఇకనుంచి నిరంతరం పర్యవేక్షించనుంది. కేవలం విద్రోహ చర్యలతోనే అగ్ని ప్రమాదాలు సంభవించాయన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రత్యేకంగా పరిగణించింది. పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Also Read: ఏకంగా 2.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ.. అందులో మీరు పేరుందో తెలుసుకోండి

అమరావతి రాజధాని లో ఇప్పటివరకు పోలీస్ చెక్ పోస్ట్లు లేవు. కేవలం రాజకీయ ప్రముఖులు సందర్శన సమయంలో మాత్రం తనిఖీలు చేపట్టేవారు. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో నిరంతర తనిఖీలు కొనసాగేలా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి వ్యాప్తంగా ఈసారి చెక్పోస్టులు కొనసాగనున్నాయి. నిరంతర తనిఖీలు ముమ్మరం కానున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version