India Russia Relations: ఆవులు ఆవులు తన్నుకుంటూ దూడల కాళ్లు విరిగినట్లుగా ఉంది వ్యవహారం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు భారత్ మెడకు చుట్టుకుంటోంది. విడుమంటే పాముకు కోపం మింగుమంటే కప్పకు కోపం అన్నట్లుగా మారింది ఇండియా పరిస్థితి. ఉక్రెయిన్ విషయంలో భారత్ రష్యాను ఎందుకు నిలదీయడం లేదని అమెరికా వాదిస్తోంది. ఇలాగైతే కష్టమని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా వ్యవహరిస్తున్న తటస్థ వైఖరి ఇప్పుడు ప్రమాదకరంగా మారనుంది.
అంతర్జాతీయంగా రష్యాపై నిబంధనలు పెరుగుతున్నాయి. నాటో దేశాలన్ని రష్యా వైఖరిని ఎండగడుతున్నాయి. కానీ భారత్ మాత్రం తమది అలీన విధానమని చెబుతూ రష్యాను పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ఈ క్రమంలో అమెరికా భారత్ పై గుర్రుగా ఉంటోంది. ఏదో విషయం తేల్చి రష్యాపై ఆంక్షలు విధించేందుకు ముందుకు రావాలని బైడెన్ సూచిస్తున్నా భారత్ మాత్రం వినడం లేదు.
Also Read: AP Assembly: ఏపీ అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ.. భజన చేసుకోవాలన్న స్పీకర్
ఉక్రెయిన్ విషయంలో చైనా సైతం ఆంక్షలు విధిస్తున్నా ఇండియా మాత్రం ఆ దిశగా ఎందుకు ముందుకు రావడం లేదని బైడెన్ అడుతున్నారు. రష్యాను ఒంటరి చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నా ఇండియా తన వైఖరి వెల్లడించకపోవడం గమనార్హం. ఇప్పటికే ఆస్ట్రేలియా, జపాన్, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలన్ని రష్యా చర్యలను ఖండించాయి. ఇండియా ఒక్కటే తన అభిప్రాయాన్ని చెప్పలేదు. దీంతో బైడెన్ రష్యాకు ఇండియా భయపడుతోందని అంటున్నారు.
అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ల మేరకు రష్యా భయపడకపోయినా ఇండియా వైఖరి మాత్రం కచ్చితంగా చెప్పాల్సిందేనని బైడెన్ పట్టుబడుతున్నారు. నాటో సభ్య దేశాలన్ని రష్యా వైఖరిని ఖండస్తున్నా ఇంతవరకు భారత్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి అడుగేస్తోంది. అమెరికా ఆగ్రహానికి గురవుతోంది. మొత్తానికి రష్యా చేస్తున్న యుద్ధకాండతో అంతర్జాతీయంగా భారత్ ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. దీనిపై అమెరికా ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇండియా తన వైఖరి వెల్లడించాలని కోరుతోంది. కానీ మనదేశం మాత్రం తమది తటస్థ వైఖరి అంటూ దాటేస్తోంది. కానీ ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాల్సి రావడంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది.
Also Read: ‘ది కశ్మీర్ ఫైల్స్’ గొప్పతనం గురించి చెప్పిన ఆర్జీవీ