Child Marriage: దేశంలో బాల్యవివాహాల తంతు కొనసాగుతోంది. పెళ్లి వయసు రాకపోయినా వివాహం చేయాలని చూస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన ఓ బాలికను నలభై అయిదు సంవత్సరాల వయసు వాడికి ఇచ్చి పెళ్లి చేయడంతో ఆమె అతడిని వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఆమె కోసం అతడు వెతికి పట్టుకున్నా చివరకు అతడితో కలిసి ఉండలేనని తేల్చేసింది. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు బాలికకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తోంది.

పదహారేళ్ల బాలకను రాజస్తాన్ లోని ధోల్ పూర్ కు చెందిన ఓ నలభై అయిదేళ్ల వ్యక్తికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. ఆమె అప్పటికే ఓ అబ్బాయిని ప్రేమించింది. తాను అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పినా వినకుండా తల్లిదండ్రులు బలవంతంగా వివాహం జరిపించారు. దీంతో ఆ బాలిక ఓ చిన్నారికి జన్మనిచ్చింది. కానీ అతడితో సంసారం చేయడానికి ఇష్టపడలేదు. ఫలితంగా ఓ యువకుడితో వెళ్లిపోయింది.
Also Read: AP Assembly: ఏపీ అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ.. భజన చేసుకోవాలన్న స్పీకర్
దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె కోసం అంతటా వెతికారు. కానీ ఆమె ఆచూకీ లభించలేదు. చివరకు ఆమె హర్యానాలో పట్టుబడింది. అక్కడే ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఫోన్ వాడకుండా ఏదైనా అవసరమైతే కొత్త సిమ్ తీసుకుని ఫోన్ మాట్లాడి అనంతరం దాన్ని పడేసేది. అలా సంవత్సరం పాటు ఎవరికి కనిపించకుండా ఉన్నా చివరకు చిక్కింది. దీంతో వారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పరిచారు.

తాను అతడితో కాపురం చేయలేనని తెగేసి చెబుతోంది. అయితే ఇప్పటికే ఓ పాప ఉండటంతో పరిస్థితి ఎలా అని అధికారులు ఆలోచనలో పడ్డారు. మొత్తానికి బాలికకు న్యాయం చేస్తారా? లేక అతడితోనే కాపురం చేయిస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసి ఆమె భవిష్యత్ ను నాశనం చేసిన తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటారా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. దేశంలో బాల్య వివాహాల జాడ్యం ఇంకా వీడటం లేదని ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది.
Also Read:Kodali Nani: చీప్ లిక్కర్ ను కనిపెట్టిన చీప్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు.. కొడాలి నాని ఆన్ ఫైరింగ్