Indian Army anti terror operation: జమ్మూ కశ్మీర్‌లో చలి రోజురోజుకు పెరుగుతోంది. కొండలపై మంచు కురుస్తుండగా, లోయలలోనూ చలి ప్రకంపనలు విస్తరిస్తున్నాయి. ఈ శీతాకాలపు పరిస్థితుల్లో సాధారణ ప్రజలు హీటర్లు ఆన్ చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, భద్రతా బలగాలు మాత్రం మరో యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి. చల్లని రాత్రిలో సైన్యం ఉగ్రవేట మొదలు పెట్టింది.
దక్షిణ కశ్మీర్‌పై ప్రధాన దృష్టి…
ఇటీవలి వారాల్లో దక్షిణ కశ్మీర్‌లో సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పెద్ద ఎత్తున సోదాలు చేపట్టాయి. రాజౌరీ, ఖతువా, రాబండ్ ప్రాంతాల నుంచి దోడా, లోలాగ్ లోయల వరకు ఈ తనిఖీలు విస్తరించాయి. సిమ్ కార్డు విక్రేతలు, అనుమానాస్పద వ్యక్తులు, వేర్పాటువాద అనుయాయులు ప్రధాన లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. షేర్ ఏ కశ్మీర్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లో పనిచేసిన వైద్యుడు మహ్మద్ అదీల్ అహ్మద్ లాకర్ నుంచి ఏకే–47 తుపాకీ స్వాధీనం కావడం ఈ ఆపరేషన్ల తీవ్రతను స్పష్టం చేసింది.
ఉగ్రవాద మద్దతుదారుల వేట
సైన్యం సమాచారం ఆధారంగా ఉగ్రవాద మద్దతుదారుల నెట్‌వర్క్‌ను కట్ చేసేందకు ప్రణాళికగా ఈ చర్యలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆధారిత జేఎకెఎన్‌వోపీల వంటి సంస్థలు స్థానిక మద్దతుతో ఉగ్రవాద చెలరేగింపులకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జమ్మూ నుంచి∙చినాబ్ వ్యాలీ వరకూ సమాంతర సోదాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు చొరబాట్లకు బ్రేక్..
ప్రతి శీతాకాలం ప్రారంభంలో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు ప్రమాదం పెరుగుతుంది. మంచు కురవడం ప్రారంభమవటంతో మార్గాలు మూసుకుపోయే ముందే జిహాదీ గ్రూపులు సరిహద్దు దాటి రావాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు దళాలు గస్తీని పెంచాయి. వేర్పాటువాద అనుయాయుల ఇళ్లలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డ్రైవ్‌లు సోదా చేసి, ఆన్‌లైన్ నెట్‌వర్క్‌లను ట్రాక్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద ప్రచారం, నిరసనల సమన్వయం జరుగుతున్నట్లు గుర్తించిన గూఢచార యంత్రాంగం ఆ హ్యాండిల్స్ పైన నిశిత పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
ఘర్షణలు నివారించేందుకే..
నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కశ్మీర్‌లో అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు కృషి చేస్తున్నాయి. లద్దాక్ ప్రాంతంలో గతంలో జరిగిన హింస ఘటనల నుంచి పాఠాలు నేర్చుకున్న సైన్యం, ఇప్పుడు రాజకీయ నిరసనల వల జuజీట్ఛలో జరిగే జిహాదీ ప్రయత్నాలను కూడా నిరోధించేందుకు కట్టుదిట్టమైన పర్యవేక్షణ ప్రారంభించింది. నిరసనల రూపంలో జెన్‌జ్జీ ఉద్యమాల తరహా కదలికలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగా కేంద్ర భద్రతా సంస్థలు, సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు సమన్వయంతో కశ్మీర్ లోయ అంతటా సన్నద్ధంగా ఉన్నారు. సమర్ధవంతమైన నిఘా ద్వారా ఉగ్రవాద మూలాలను నరికివేయాలనే ఉద్దేశ్యంతో అన్ని ఏజెన్సీలు కృషి చేస్తున్నాయి.