Telugu Movie Villains: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే చాలామంది విభిన్న కథలతో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇక హీరోల పాత్రను మలచడంలో మన దర్శకులు చాలా వరకు తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నారు. అంగ వైకల్యంతో ఉన్న హీరోల పాత్రలను మనం ఇప్పటికే మన సినిమాల్లో చాలా వరకు చూశాం. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రతో రామ్ చరణ్ ఎలాంటి గుర్తింపును సంపాదించుకున్నారో మనందరికి తెలుసు… రాజా ది గ్రేట్ సినిమాలో అంధుడిగా రవితేజ నటించి మెప్పించాడు… హీరో అంగవైకల్యంతో ఉంటే సినిమా చూస్తున్న ప్రేక్షకులకు రెట్టింపు ఉత్సాహాన్ని తీసుకువస్తోంది. ఎందుకంటే బేసిగ్గా హీరో డౌన్ లో ఉంటాడు కాబట్టి బలంగా ఉన్న విలన్ ని కొడితే అది ప్రేక్షకుడికి హై ఇస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే హీరోలకి కాకుండా విలన్లకి అంగవైకల్యం పెట్టడం అనేది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. రాజమౌళి సినిమాల్లో మనకు ఇది తరచుగా కనిపిస్తోంది. బాహుబలి సినిమాలో బిజ్జల దేవుడు క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి ఒక చెయ్యిని కోల్పోయిన క్యారెక్టర్ గా కనిపిస్తోంది. అందులో ఆయన పవర్ఫుల్ విలనిజాన్ని చూపించాడు. అలాగే ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర కూడా అంగవైకల్యంతో ఉంటుంది. వీల్ చైర్ కి పరిమితమైన ఆయన పాత్ర తో ఎలాంటి విలనిజాన్ని పండిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
ముఖ్యంగా ‘కుంభ’ అనే పాత్రలో పృథ్వీరాజ్ కుమారన్ తన విలనిజాన్ని చాలా స్టైలిష్ గా చూపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇంతకుముందు సూర్య ’24’ సినిమాలో వీల్ చైర్ కి పరిమితమైన పాత్రలో నటించి ఆత్రేయ పాత్రలో గొప్ప విలనిజాన్ని చూపించాడు. మరి దానికి మించి ఈ మూవీలో పృథ్వీ రాజ్ సుకుమారన్ పాత్ర ఉండాలి.
అలాంటప్పుడే ఇది ఎలివేట్ అవుతుంది లేకపోతే మాత్రం చాలా విమర్శలను ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. అలాగే ఇప్పుడు పృథ్విరాజ్ సుకుమారన్ లుక్కును 24 సినిమాలో సూర్య లుక్ తో పోలుస్తూ చాలా విమర్శలు చేస్తున్నారు. కాబట్టి నటనలో సైతం వైవిధ్యాన్ని చూపిస్తేనే పర్లేదు లేకపోతే మాత్రం సూర్య చేసిన నటన కంటే పృథ్వి రాజ్ సుకుమారన్ యాక్టింగ్ తేలిపోతోంది. దాంతో చాలా వరకు డీలా పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అలాగే సినిమా మీద భారీ నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీటన్నింటిని తట్టుకొని నిలబడాలంటే మాత్రం ఆ క్యారెక్టర్ ను చాలా బాగా డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది… అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో పాత్రకి దీటుగా విలన్ ఎలాంటి పోటీని ఇస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.