సమస్యలో ఉన్నవారిని ఆదుకునేవారు రెండు రకాలుగా ఉంటారు. మానవత్వంతో లాభాపేక్ష లేకుండా సాయం చేసేవారు మొదటివారు. వారికి అనివార్యమైన అవసరం ఉంది కాబట్టి.. దాన్ని అవకాశంగా మలుచుకొని సొమ్ము చేసుకునేవారు రెండో రకం. ఈ విషయంలో భారత్-చైనా ఏ రకానికి చెందుతాయో గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి.
Also Read: దేశంలో వాట్సాప్ బ్యాన్ అవుతుందా? కేంద్రం కఠిన నిబంధనలు
ప్రపంచానికి అలీనవిధానంతో ఉదారతను, సేవా తత్పరతను బోధించిన దేశం ఇండియా. కేంద్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా.. ఇప్పటి వరకూ కొనసాగిన విధానం ఇదే. అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలనే తత్వం భారతీయులది. ఈ విషయంలో గతంలో ఎన్నోసార్లు నిరూపితమైంది. ప్రపంచ దేశాల్లో కరవు, వరదలు, ఇతర విపత్తులు సంభవించినప్పుడు.. సహాయ సహకారాలు అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందే ఉంది.
కానీ.. చైనా తీరు ఇందుకు పూర్తి విరుద్ధం. కష్టాల్లో ఉన్నవారికి అవసరం అనివార్యమవుతుంది. కాబట్టి.. డబ్బులు చెల్లించైనా సాయాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. ఆపదలో ఉన్నవారిలో చైనా ఈ కోణాన్నే చూస్తుందనే విషయం గతంల ఎన్నోసార్లు రుజువైంది. సాయం పేరుతో ఇతర దేశాలకు అప్పులివ్వడం.. వాటిని ఊబిలోకి దించడం.. ఆ తర్వాత పీడించడం ఆ దేశ విధానమని చాలాసార్లు తేలింది. తాజాగా.. కొవిడ్-19 వ్యాక్సిన్ విషయంలో ఈ కఠిన వాస్తవం మరోసారి ప్రపంచానికి తెలియవచ్చింది. అదే సమయంలో భారత్ ఉదారత చర్చనీయాంశమైంది.
కొవిడ్-19ను అడ్డుకునేందుకు చైనా తయారు చేసిన వ్యాక్సిన్ ‘సోనవాక్’. ఈ టీకాను మయన్మార్ కు మూడు లక్షల డోసులు ఇస్తామని ముందుగా ప్రకటించింది చైనా. ఆ తరవాత చేతులెత్తేసింది. బంగ్లాదేశ్ కు సైతం ఇదే విధమైన హామీ ఇచ్చింది. కానీ.. టీకా తయారు చేయడానికి అయ్యే ఖర్చులో కొంత భరించాలని కొర్రీ పెట్టింది. దీంతో.. బంగ్లాదేశ్ నిరసన కూడా వ్యక్తం చేసింది. ఇదిలాఉంటే.. ‘సోనవాక్’ టీకా సమర్థతపై పలు సందేహాలున్నాయి. దీని ప్రభావ శీలత 50.75 శాతమేనని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం.. ఆగ్నేయాసియా, యునైటెడ్ అరబ్ఎమిరేట్స్, ఇండోనేసియా, బ్రెజిల్, బొలీవియా, పెరూ తదితర దేశాల్లో ప్రయోగతాత్మకంగా వేస్తున్నారు. మొత్తం 5 రకాల రకాలను తయారు చేశామని ప్రకటించిన చైనా.. వాటిని అమ్ముకునేందుకు తీవ్రంగా యత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: నాడు ఎన్టీఆర్.. నేడు విష్ణువర్ధన్ రెడ్డి..
అయితే.. భారత్ మాత్రం సేవాదృక్పథంతో కొన్ని దేశాలకు ఉచితంగా, మరికొన్ని దేశాలకు తక్కువ దరలకే టీకా సరఫరా చేసింది. ఇంకా చేస్తోంది. దేశీయ టీకాలు కొవిషీల్డ్, కొవాగ్జిన్ 32 లక్షల డోసులను పొరుగు దేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులకు ఉచితంగా అందించింది. బ్రిజిల్ కు రెండు మిలియన్ల డోసులు అందించింది. దీంతో బ్రెజిల్ అధినేత బోల్సోనారో హర్షం వ్యక్తం చేశారు. నేపాల్ కు సైతం మిలియన్ డోసులను సరపరా చేసింది భారత్. ఇంకా సీషెల్స్, అఫ్గానిస్ధాన్, మారిషస్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు కూడా భారత్ సంసిద్ధత వ్యక్తంచేసింది.
అదేవిధంగా.. శ్రీలంకకు అయిదు లక్షల డోసులు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. చైనా టీకాను ఆ దేశం నిరాకరించడం గమనార్హం. ఒమన్, నికారాగ్వా, పసిఫిక్ ద్వీప దేశాలకూ టీకా పంపేందుకు భారత్ సిద్ధంగా ఉంది. గతంలోనూ 150 దేశాలకు హైడ్రాక్సీ,క్లోరోక్విన్, రెమిడెసివిల్ పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్), టెస్ట్ కిట్లు పంపింది ఇండియా.
ఈ విధంగా పొరుగు వారిని ఆదుకోవాలనే ఉదార వాదాన్ని భారత్ ఎన్నటికీ వదులుకోదు అనే విషయం మరోసారి నిరూపితమైంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రపంచ దేశాలు భారత్ తీరును కొనియాడాయి. కొవిడ్ టీకా పంపిణీలో భారత్ సేవా తత్పరతపై డబ్ల్యూహెచ్‌వో, ఐక్యరాజ్యసమితి కూడా అభినందనలు తెలపడం గొప్ప విషయం.
Check this Space For More information on Indian Political News