https://oktelugu.com/

ఎస్బీఐ సూపర్ స్కీమ్.. నెలనెలా డబ్బులు తీసుకునే ఛాన్స్..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఎస్బీఐ అమలు చేస్తున్న స్కీమ్ లలో ఎస్బీఐ యాన్యూటీ డిపాజిట్ స్కీమ్ ఒకటి. సాధారణంగా మనం బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటే వడ్డీతో పాటు నెలవారీ వాయిదాలను చెల్లించడం ద్వారా లోన్ మాఫీ అవుతుంది. అదే విధంగా ఈ స్కీమ్ లో బ్యాంకులో మనం డిపాజిట్ చేసిన నగదును ప్రతి నెలా అసలుతో పాటు కొంత […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 26, 2021 / 11:18 AM IST
    Follow us on

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఎస్బీఐ అమలు చేస్తున్న స్కీమ్ లలో ఎస్బీఐ యాన్యూటీ డిపాజిట్ స్కీమ్ ఒకటి. సాధారణంగా మనం బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటే వడ్డీతో పాటు నెలవారీ వాయిదాలను చెల్లించడం ద్వారా లోన్ మాఫీ అవుతుంది. అదే విధంగా ఈ స్కీమ్ లో బ్యాంకులో మనం డిపాజిట్ చేసిన నగదును ప్రతి నెలా అసలుతో పాటు కొంత వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.

    Also Read: దేశంలో బ్యాన్ కానున్న వాట్సాప్ యాప్.. నిజమేనా..?

    ఈ స్కీమ్ లో ఒకేసారి లేదా 36, 60, 84, 120 నెలల కాలానికి డిపాజిట్లను స్వీకరిస్తారు. నెలవారీ సమాన వాయిదాను ముందే నిర్ణయించి ఈ స్కీమ్ ద్వారా చెల్లించడం జరుగుతుంది. ఈ స్కీమ్ లో గడువు తీరేనాటికి డిపాజిట్ జీరో అవుతుంది. ఈ స్కీమ్ లో 15 లక్షల రూపాయల కంటే తక్కువ మొత్తం జమ చేసిన వారు వ్యవధి కన్నా ముందుగానే ఈ స్కీమ్ ద్వారా నగదు తీసుకునే అవకాశాలు ఉంటాయి.

    Also Read: ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. రోజుకు రూ.230తో రూ.17.5 లక్షలు మీ సొంతం..?

    15 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే మాత్రం ఖాతాదారుడు మరణించిన సందర్భంలో మాత్రమే నామినీ డబ్బులను వెనక్కు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అత్యవసరం అయితే డిపాజిట్ చేసిన మొత్తంలో 75 శాతాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు సాధారణంగా వచ్చే వడ్డీతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం వడ్డీ లభిస్తుంది. 6.20 శాతం చొప్పున సీనియర్ సిటిజన్లకు వడ్డీ జమవుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఐదు సంవత్సరాలకు మించి డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ వుయ్ కేర్ స్కీమ్ కింద ఇచ్చే 0.30 శాతం అదనపు వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసిన వారికి రూ.5.30 నుంచి రూ.6.20 వరకు వడ్డీ లభిస్తుంది.