Homeజాతీయ వార్తలుIndia Economy: వేగంగా భారత ఆర్థికాభివృద్ధి.. 2030 నాటికి 3వ స్థానం మనదే!

India Economy: వేగంగా భారత ఆర్థికాభివృద్ధి.. 2030 నాటికి 3వ స్థానం మనదే!

India Economy: భారత్‌ దశాబ్దకాలంగా ఆర్థికంగా వేగంగా ఎదుగుతోంది. తయారీ రంగం పుంజుకుంటోంది. ఎగుమతులు పెరుగుతున్నాయి. దీంతో మన ఆర్థికాభివృద్ధి కూడా పరుగులు పెడుతోంది. ఇప్పటికే గడిచిన పదేళ్లలో భారత్‌ 5వ అతిపెద్ద ఎకానమీగా ఎదిగింది. రాబోయే నాలుగేళ్లలో అంటే 2030 నాటికి భారత్‌ 7.3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వేగవంతమైన పురోగతి అమెరికా, చైనా వంటి దేశాల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. భారత్‌ జీడీపీ పెరుగుదల రేటు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండటం ఈ మార్పుకు కారణం.

డెడ్‌ ఎకానమీ అన్న ట్రంప్‌..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత ఆర్థిక వ్యవస్థను ‘స్థిరంగా లేని’ డెడ్‌ ఎకానమీ అని విమర్శించారు. ట్రంప్‌ వ్యాఖ్యలకు మన దేశంలోని విపక్ష నేతలు వంత పాడారు. అయిత ఎవరేమన్నా.. దేశ ఆర్థిక పురోగతి మాత్రం ఆగడం లేదు. వేగంగా దూసుకుపోతోంది.

ఓర్వలేకనే టారిఫ్‌లు..
భారత ఆర్థిక బలోపేతాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో అమెరికా అధిక టారిఫ్‌లు విధించింది. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో పెరిగిన ఉద్రిక్తతలకు సూచిక. చైనా కూడా అంతర్గత సమస్యలు, సరిహద్దు విషయాల్లో భారత్‌ను రెచ్చగొడుతోంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఉత్తేజపరచడం ఈ వ్యూహంలో భాగమే.

డిఫెన్స్, ఆర్థిక రంగాల్లో వేగంగా..
భారత ప్రభుత్వం రక్షణ, ఆర్థిక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెంచుతోంది. స్వయం సమృద్ధి, ఆధునికీకరణ కార్యక్రమాలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ప్రపంచ శక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. భారత్‌ పొరుగు దేశాల్లో ప్రభావం పెంచుకునేందుకు కృషి చేస్తున్నారు.

అమెరికా, చైనా భారత ఆర్థిక ఆవిష్కరణలను సహించలేకపోతున్నాయి. పొరుగు దేశాలపై పన్నులు, రాజకీయ ఒత్తిడి ద్వారా భారత్‌ను అడ్డుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ భారత్‌ అడుగులు ఆపకుండా ముందుకు సాగుతోంది. 2030 నాటి మూడో స్థానం ఈ పోరాటంలో విజయానికి చిహ్నం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version