Narendra Modi: మనదేశ చరిత్రలో సుదీర్ఘకాలం పాలించిన ప్రధానమంత్రిగా జవహార్ లాల్ నెహ్రూ అరుదైన ఘనత నెలకొల్పారు. ఆయన తర్వాత ఎంతోమంది ప్రధానమంత్రులుగా పని చేశారు. కానీ, నెహ్రూ స్థాయిని ఎవరూ అందుకోలేకపోయారు. ఇన్నాళ్లకు నెహ్రూ స్థాయిని మించి పోయారు దేశ ప్రధాని నరేంద్రమోడీ. ఈనెల పదవ తేదీతో నెహ్రూ రికార్డును నరేంద్రమోడీ నెలకొల్పనున్నారు.
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ 4,399 రోజులలో అత్యంత ఎక్కువకాలం ఆ పదవిలో కొనసాగిన వ్యక్తిగా నిలిచారు. మనదేశ ప్రధానిగా నెహ్రూ 4,398 రోజులు పని చేశారు. 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు నెహ్రూ ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 2014 మే 26న తొలిసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆయన అదేపదవిలో కొనసాగుతున్నారు.
2014లో ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్రమోడీ.. 2019 ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లు సాధించడంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించడంతో బీజేపీ కి మిత్ర పక్షాల అవసరం పడింది. చంద్రబాబు, నితీష్ కుమార్ సహకారంతో కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం ఆర్థిక రంగంలో దూకూడు సాగించడం మొదలైంది. రోడ్ల నిర్మాణం, విమనాశ్రయాలు, ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు.. ఇలా ప్రతిరంగంలో దేశం దూసుకుపోతోంది. కాకపోతే మనదేశ కరెన్సీ విలువ పడిపోవడం ప్రధాని నరేంద్రమోడీ దూకుడుకు బ్రేక్ వేస్తోంది. ధరలు పెరగడం..ఇంకా అనేక రకాల అవరోధాలు ప్రధాని నరేంద్రమోడీకి ఇబ్బందికరంగా మారాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్నపరిణామాలు కూడా దేశ ఆర్థిక ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయి. కాగా, ఈ సమస్యలను అధిగమించగలిగితే నరేంద్రమోడీకి తిరుగుండదు.
దౌత్య సంబంధాల ద్వారా దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నరేంద్రమోడీ అడుగులు వేస్తున్నారు. మధ్య ప్రాచ్యంలో యుద్ధం మొదలుకావడం.. చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో హార్మూజ్ జలసంధి నుంచి కాకుండా, ప్రత్యామ్నయంగా చమురు రవాణా చేసే విధంగా వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చకుంటున్నది భారత్. ఒకవేళ ఇది కనుక కార్యరూపం దాల్చితే భారత్ మీద ఆర్థికంగా ఒత్తిడి తగ్గుతుంది. ఫారెక్స్ నిల్వలు పెరిగే అవకాశం ఉంది. నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయాలు సత్వర ఫలితాలు వస్తే భారత్ కు ఆర్థికంగా సానుకూలంగా అడుగులు వేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
