https://oktelugu.com/

ICMR Warning : దేశంలో పెరుగుతున్న మొండి దగ్గు, జ్వరాలు : ఐసీఎంఆర్ హెచ్చరికతో ఆందోళన

ICMR warning : ఉదయం మంచు, మధ్యాహ్నం మాడు పగిలేలా ఎండ వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మొన్నటి దాకా కోవిడ్‌తో చుక్కలు చూసిన జనాలకు ఇప్పుడు కొత్తగా మారుతున్న వాతావరణం చికాకు తెప్పిస్తోంది. ప్రతీ ఇంట్లో ఒక్కరు లేదా ఇద్దరు జలుబు లేదా దగ్గుతో బాధపడుతున్నారు. అవి కూడా తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. ఎన్ని సిరప్‌లు వాడినా, మాత్రలు మింగినా జలుబు తగ్గడం లేదు. దగ్గు అదుపులోకి రావడం లేదు. దీనికి తోడు ఊపిరితిత్తుల్లో నిమ్ము […]

Written By:
  • Rocky
  • , Updated On : March 4, 2023 10:19 pm
    Follow us on


    ICMR warning : ఉదయం మంచు, మధ్యాహ్నం మాడు పగిలేలా ఎండ వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మొన్నటి దాకా కోవిడ్‌తో చుక్కలు చూసిన జనాలకు ఇప్పుడు కొత్తగా మారుతున్న వాతావరణం చికాకు తెప్పిస్తోంది. ప్రతీ ఇంట్లో ఒక్కరు లేదా ఇద్దరు జలుబు లేదా దగ్గుతో బాధపడుతున్నారు. అవి కూడా తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. ఎన్ని సిరప్‌లు వాడినా, మాత్రలు మింగినా జలుబు తగ్గడం లేదు. దగ్గు అదుపులోకి రావడం లేదు. దీనికి తోడు ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుతోంది. ఇది ఎంతకీ తగ్గడం లేదు. కొంతమంది రోగుల్లో నోట్లో నుంచి రక్తం కూడా పడుతోంది.

    వారానికి మించి ఉంటోంది

    వాస్తవానికి జలుబు అనేది వారం పాటు ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది. దగ్గు కూడా ఇంచుమించుగా ఇలానే ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో జలబు సోకితే నెలలపాటు ఉంటోంది. దగ్గు కూడా చుక్కలు చూపిస్తోంది. ఈ తరహా కేసులు ఇటీవల పెరిగిన నేపథ్యంలో ఐసీఎంఆర్‌ పలువురి రోగుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా.. దిగ్ర్భాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం వ్యాపిస్తున్న జలబు, దగ్గుకు కోల్డ్‌ బగ్‌ కారణమని ఐసీఎంఆర్‌ చెబుతోంది. దీని వల్ల నెలలపాటు జలుబు, దగ్గు ఉంటోందని వివరిస్తోంది. అయితే కొందరిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు కన్పిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ఈ తరహా లక్షణాలున్న వారితో హాస్పిటళ్ల ఓపీలు నిండిపోతున్నాయి. వారికి చికిత్స చేసిన వైద్యులు కూడా ఈ వ్యాధుల బారిన పడుతున్నారు.

    కోల్డ్‌ బగ్‌

    కోవిడ్‌, వాతావరణంలో మార్పులు, కాలుష్యం వంటికి ఈ కోల్డ్‌ బగ్‌కు కారణమని ఐసీఎంఆర్‌ చెబుతోంది. రోజులతరబడి జలుబు,దగ్గు ఉండటం వల్ల జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అదే పనిగా దగ్గడం వల్ల ఛాతీలో విపరీతమైన నొప్పి ఉంటోంది. దీనికి తోడు వైరల్‌ ఫీవర్‌, బ్రాంకైటీస్‌ వంటి సమస్యలు కన్పిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. మరో వైపు గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతల్లోనే ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈతరుణంలో ఐసీఎంఆర్‌ మార్గనిర్దేశకాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో కి వెళ్తున్నప్పుడు మాస్క్‌లు ధరించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కోల్డ్‌ బగ్‌ తో బాధపడేవారు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఒకరకంగా చెప్పాలంటే కోవిడ్‌ సమయంలో ఎలాంటి జాగ్త్రత్తలు పాటించారో, అలాంటి నిబంధనలు అనుసరించాలని చెబుతోంది.