
Botsa Sajjala : పెట్టుబడుల ఆకర్ష పేరుతో ప్రతిష్టాత్మకంగా వైసీపీ తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ లో బొత్స సత్యానారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి కనబడలేదు. పార్టీలో కీలకమైన నేతలుగా చలామణి అవుతున్న వీరిరువురిని దూరంగా పెట్టడానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. విశాఖలో సభ జరుగుతుండగా, తెర వెనుక ఇంకో కార్యక్రమమేదో వీరికి జగన్ అప్పజెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహంలా పారించేందుకు జగన్ విశాఖలో రెండు రోజులు గ్లోబల్ సమ్మిట్ ను ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు హాజరవుతుండటంతో, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసే బాధ్యతలను అధికారులతో పాటు సీనియర్ నేతలకు అప్పగించారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు కార్పొరేషన్ చైర్మన్ స్థాయి వ్యక్తులకు కూడా ఆహ్వానాలు పంపారు.
ఉత్తరాంధ్రలో బొత్స సత్సనారాయణ సీనియర్ నేత. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పని చేశారు. జగన్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు. అలాంటిది కార్యక్రమ నిర్వహణ బాధ్యతల నుంచి ఆయనను తప్పించేంత పని ఏమై ఉంటుందో వైసీపీ శ్రేణులకు అంతుపట్టడం లేదు. మరో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన ప్రధాన ప్రభుత్వ సలహాదారుడు. జగన్ తరువాత అంతటి వ్యక్తి. జగన్ ను ఎవరు కలవాలన్న ముందుకు ఆయనను దాటిల్సి ఉంటుంది.
వైసీపీ సీనియర్ నేతల అందిస్తున్న సమాచారం మేరకు బొత్స, సజ్జలకు జగన్ మరో పెద్ద పని అప్పజెప్పారంట. అమరావతిలో ఉండి ఉద్యోగ సంఘాలను సమన్వయం చేయడమని అంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ వంటి కీలక సభలను వదిలేసి ఇప్పటికిప్పుడు ఉద్యోగ సంఘాలతో మాట్లాడాల్సిన అవసరం లేదు. పైగా వీరి ఉద్యమం తారాస్థాయిలో ఏమీ జరగడం లేదు. అయితే ఇది కూడా అఫీషియల్‌గా క్లారిటీ లేదు. పార్టీలో అంతటి ప్రాధాన్యత కలగిన వ్యక్తులైన బొత్స, సజ్జలను జగన్ కావాలనే దూరంగా పెట్టారా? లేదా తెర వెనుక బాగోతం ఏమైనా ప్లాన్ చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.