Publicity: జగన్ అధికారంలోకి వచ్చి అప్పుడే రెండేళ్లు పూర్తిపోయింది. ఈ రెండేళ్లలో జగన్ సర్కార్ ఏపీలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకెళుతోంది. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతూ ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
ఈక్రమంలోనే జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రెండేళ్ల తర్వాత పింఛన్లను పెంచేంది. 2022 కొత్త సంవత్సరం నుంచి అవ్వాతాతలకు ఇప్పటి వరకు పింఛన్ కు అదనంగా మరో రూ.250 పింఛన్ అదనుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారుడికి సంవత్సరానికి అదనంగా 3వేల రూపాయలు అందనుంది.
కరోనా సమయంలో పైసాకు పైసాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో పింఛన్ పెంపు లబ్ధిదారులకు ఒకరకంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం ఫించన్ పెంపుపై చేస్తున్న పబ్లిటీసీ కోసం లక్షల్లో ఖర్చు చేస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. పింఛన్ పెంపును ప్రభుత్వం తమ ఘనతకు చెప్పుకునేందుకు రెడీ అయింది.
Also Read: నిధులు, అభివృద్ధి.. వైసీపీలో ముసలం.. జగన్ ను ముంచేస్తుందా?
వరుసగా నాలుగైదు రోజులు పింఛన్ పెంపుపై ప్రభుత్వం హడావుడి చేసేందుకు ప్రణాళికలను సిద్దంగా చేసింది. ఓ రోజు ఫుల్ పేజీ యాడ్స్, టీవీ ప్రకటనలు, సీఎం జగన్ సందేశంతోపాటు ఈసారి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రతీ లబ్ధిదారుడి దగ్గరకు గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వెళ్లి పింఛన్ పెంపును వివరించనున్నారు.
ఇప్పటికే వాలంటీర్లు గ్రామాల్లో హడావుడి మొదలు పెట్టారు. లబ్ధిదారులతో సెల్ఫీ దిగి ఆ సమాచారాన్ని అప్ లోడ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెండురోజులు జరుగనుంది. ఆ తర్వాత జనవరి 1న సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దనందిపాడులో పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో లైవ్ ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆ రోజు కూడా పేపర్లు, టీవీల్లో పుల్ పబ్లిసీటీ ఉండనుంది. మొత్తంగా రూ.250 ఫించన్ పెంచిన జగన్ సర్కార్ పబ్లిటీసీ కోసం కోట్లల్లో ఖర్చు చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ రాద్దాంతం చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికలు పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా పబ్లిసిటీని చేసుకుంటూ ముందుకెళుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Also Read: సీఎం జగన్ మనిషేనా…? మరి ఎందుకు ఇలా!