పెరిగిన మోడీ ఆస్తులు.. అమిత్ షావి తగ్గాయి.. ఎవరి సంపాదన ఎంతంటే?

ప్రతీ ఏటా ప్రధానమంత్రితో పాటు కేబినేట్‌ మంత్రుల ఆస్తుల జాబితాను ప్రధాని కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుంది. తాజాగా మంత్రులు, ప్రధాన మంత్రి సమర్పించిన ఆస్తుల జాబితాల్లో మోడీ ఆస్తులు పెరిగినట్లు కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే తాజాగా ప్రధాని ఆస్తుల విలువలు పెరిగాయి. మిగతా మంత్రుల ఆస్తుల్లోనూ మార్పులు వచ్చాయి. ప్రధాని కార్యాలయం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. Also Read: ఒక రాష్ట్రం.. ఆరుగురు సీఎం అభ్యర్థులు బ్యాంకు డిపాజిట్లు, సురక్షిత పెట్టుబడిల ద్వారా వచ్చే ఆదాయంతో […]

Written By: NARESH, Updated On : October 15, 2020 3:20 pm
Follow us on

ప్రతీ ఏటా ప్రధానమంత్రితో పాటు కేబినేట్‌ మంత్రుల ఆస్తుల జాబితాను ప్రధాని కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుంది. తాజాగా మంత్రులు, ప్రధాన మంత్రి సమర్పించిన ఆస్తుల జాబితాల్లో మోడీ ఆస్తులు పెరిగినట్లు కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే తాజాగా ప్రధాని ఆస్తుల విలువలు పెరిగాయి. మిగతా మంత్రుల ఆస్తుల్లోనూ మార్పులు వచ్చాయి. ప్రధాని కార్యాలయం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: ఒక రాష్ట్రం.. ఆరుగురు సీఎం అభ్యర్థులు

బ్యాంకు డిపాజిట్లు, సురక్షిత పెట్టుబడిల ద్వారా వచ్చే ఆదాయంతో ప్రధాని నరేంద్రమోడీ నికర ఆస్తి విలువ పెరిగింది. గత ఏడాది రూ.2.49 కోట్లు ఉండగా.. ప్రస్తుం 2.85 కోట్లకు పెరిగింది. మొత్తంగా రూ.36 లక్షల ఆదాయం పెరిగినట్లు పీఎంవో తెలిపింది. జూన్‌ నాటికి ప్రధాని చేతిలో రూ.31,450 నగదు, ఎస్‌బీఐ గాంధీనగర్‌ ఎన్‌ఎస్‌సి శాఖ వద్ద  3,38,173 బ్యాంక్‌ బ్యాలెన్స్‌ మాత్రమే ఉంది. అదే శాఖలో ఎప్‌డీఆర్‌, ఎంఓడి బ్యాలెన్స్‌ 1,60,28,939 రూపాయలు ఉన్నాయి. రూ.8,43,124 విలువైన నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లు రూ.1,50,957 విలువైన జీవిత బీమా పాలసీలు, రూ.20,000 విలువైన పన్ను ఆదా చేసే ఇన్‌ఫ్రా బాండ్లను మోడి కలిగి ఉన్నారు.

కేంద్ర హోంశాఖ మంత్రి ఆస్తుల వివరాల్లోకెళ్తే.. గతేడాది రూ.32.3 కోట్లతో పోలిస్తే, జూన్‌ నాటికి షా తన నికర విలువను రూ.28.33 కోట్లుగా ఉంది. అమిత్‌షా మొత్తం మీద గుజరాత్‌లో 10 స్థిరాస్తులను కలిగి ఉన్నారు. ఆయన చేతిలో నగదు రూ.15,814, బ్యాంకు బ్యాలెన్స్‌, ఇన్సూరెన్స్‌లో రూ.1.04 కోట్లు, రూ.13.47 లక్షల విలువైన పెన్షన్‌ పాలసీలు, ఫిక్స్‌డు డిపాజిట్‌ పథకాలలో రూ.2.79 లక్షలు, రూ.44.47 లక్షల విలువైన ఆభరణాలు కలిగిఉన్నారు.

Also Read: హత్రాస్‌ బాధిత కుటుంబాన్ని రక్షించడానికి యూపీ సర్కార్ సంచలనం

మిగతా మంత్రుల విషయానికొస్తే రాజ్‌నాథ్‌ సింగ్‌ రూ.1.97 కోట్ల విలువైన చరాస్తులు, రూ.2.97 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. మరో మంత్రి నితిన్‌ గడ్కరీ సంయుక్త స్థిరాస్తులు రూ.15.98 కోట్లు కలిగి ఉన్నట్లు తెలిపారు. నిర్మల సీతారామన్‌  రూ.99.36 లక్షల విలువైన ఇల్లు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో కలిసి 16.02 లక్షలు విలువైన ఆస్తులు మాత్రమే కలిగి ఉన్నారట. సీతారామన్‌కు కారు లేదని, బజాజ్‌ చేతక్‌ స్యూటర్‌ ఉన్నట్లు పీఎంవో తెలిపింది.