https://oktelugu.com/

హైదరాబాద్ కు ప్రయాణమా.. అస్సలు వద్దు..!

ఒక్క వర్షంతో మహానగరమైన హైదరాబాద్‌ ప్రజలు నరకం చూడాల్సిన పరిస్థితి. ఈ భారీ వర్షం కారణంగా హైదరాబాద్ మహానగరమే కాదు.. దాని శివారు కూడా ఆగమైంది. ఇళ్లే కాదు.. రోడ్లూ ధ్వంసమయ్యాయి. ఏ రోడ్డు ఎక్కడ కుంగిపోతుందో తెలియకుండా ఉంది. ఇప్పటికే చాలా వరకు రోడ్లు డ్యామేజీ అయ్యాయి. నిత్యం భాగ్యనగరికి లక్షలాదిగా జనం వచ్చి వెళ్తుంటారు. కరోనా పుణ్యమా అని ప్రజా రవాణా పరిమితం కావటంతో ఈ సంఖ్య తగ్గింది. అయినప్పటికీ ప్రైవేటు వాహనాలతో రాకపోకలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 15, 2020 / 01:46 PM IST
    Follow us on

    ఒక్క వర్షంతో మహానగరమైన హైదరాబాద్‌ ప్రజలు నరకం చూడాల్సిన పరిస్థితి. ఈ భారీ వర్షం కారణంగా హైదరాబాద్ మహానగరమే కాదు.. దాని శివారు కూడా ఆగమైంది. ఇళ్లే కాదు.. రోడ్లూ ధ్వంసమయ్యాయి. ఏ రోడ్డు ఎక్కడ కుంగిపోతుందో తెలియకుండా ఉంది. ఇప్పటికే చాలా వరకు రోడ్లు డ్యామేజీ అయ్యాయి. నిత్యం భాగ్యనగరికి లక్షలాదిగా జనం వచ్చి వెళ్తుంటారు. కరోనా పుణ్యమా అని ప్రజా రవాణా పరిమితం కావటంతో ఈ సంఖ్య తగ్గింది. అయినప్పటికీ ప్రైవేటు వాహనాలతో రాకపోకలు జోరుగానే సాగుతున్నాయి.

    Also Read: వరద బీభత్సం.. కేటీఆర్ లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం

    ఇప్పుడు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కడ ఏ గొయ్యి ఉందో అర్థం కాకుండా ఉంది. జాతీయ రహదారి మీద వరద నీరు ముంచెత్తటంతో భారీగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు నలుదిశలా ఉన్న రోడ్ల పరిస్థితీ అధ్వానంగా మారింది. అందుకే.. ఇప్పటికిప్పుడు హైదరాబాద్ మహానగరానికి రావాలన్న జర్నీ ప్లాన్ వేసుకోకపోవటమే మంచిదన్న మాట వినిపిస్తోంది.

    బెంగళూరు హైవేనే తీసుకుంటే అరాంఘర్–శంషాబాద్ మార్గం గగన్ పహాడ్‌లోని అప్పా చెరువు తెగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని వాహనాలైతే వరద తాకిడికి కొట్టుకుపోయాయి కూడా. ఎక్కువగా ప్రయాణాలుసాగే హైదరాబాద్–విజయవాడ హైవే విషయానికి వస్తే.. అబ్దుల్లాపూర్ మెట్ దగ్గరి రెడ్డి కుంట చెరువు తెగింది. దీంతో వరద నీటి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. కిలోమీటర్లమేర ట్రాఫిక్ నిలిచింది. రోడ్ల మీద గోతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. శ్రీశైలం హైవేలోనే రహదారుల మీద వరద నీరు నిలచింది. గురువారం పరిస్థితి మెరుగుపడినా.. వర్షాల జోరు తగ్గిన తర్వాతే ప్రయాణం పెట్టుకుంటే మంచిదని చెబుతున్నారు.

    Also Read: ఏడాది వర్షం.. ఒక్క రోజులోనే కురిసిందా! షాకింగ్ నిజాలు

    నాగపూర్ హైవే మార్గంలోనూ వాహనదారుల పరిస్థితి అలానే ఉంది. భారీ వర్షంతో మెదక్ జిల్లా మనోహరాబాద్ వద్ద జరుగుతున్న పనులు ఇబ్బందులను మరింతగా పెంచాయి. అండర్ పాస్ పూర్తిగా నీటితో నిండిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో తుప్రాన్.. నాచారం.. గజ్వేల్.. ములుగు.. కిష్టాపూర్.. మేడ్చల్ మీదుగా వాహనాలను తరలించారు. వరంగల్ హైవేలోని ఉప్పల్ నల్లచెరువు కట్ట తెగి కూడా రాకపోకలకు తీవ్ర విఘాతాన్ని కల్పించాయి. ఘట్ కేసర్ నుంచి యామ్నాంపేట మీదుగా ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ వైపు వాహనాల్ని మళ్లించారు. అందుకే.. ఇప్పుడు ఇతర జిల్లాలు,, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ప్రయాణికులను వాయిదా వేసుకోవడమే మంచిదని అనిపిస్తోంది.