Homeజాతీయ వార్తలుMen worship : అక్కడ మగవాళ్లే చీర కట్టులో పూజలు చేస్తారు.. ఈ గుడిలో వింత...

Men worship : అక్కడ మగవాళ్లే చీర కట్టులో పూజలు చేస్తారు.. ఈ గుడిలో వింత ఆచారం..!

Men worship : భారత దేశంలో విభిన్న సంస్కృతులు సంప్రదాయాలు నెలవై ఉన్నాయి. ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు, వనరులు, పండే పంటల ఆధారంగా జీవన విధానం మారుతూ ఉంటుంది. కానీ మెజారిటీ ప్రజలు పాటించేంది హిందూ సంప్రదాయమే. పూజా విధానంలో తేడా ఉంటుంది కానీ, పూజించేది భగవంతుడినే. ధూప దీప నైవేద్యాలతో దేవుళ్లను పూజించే సంస్కృతి హిందూ సంప్రదాయంలోనే కనిపిస్తుంది. తాజాగా కొల్లాం జిల్లాలోని చమయావిలక్కు గుడిలోని అరుదైన సంద్రపాయం వీడియో ఇప్పుడు సోషల మీడియాలో వైరల్‌ అవుతోంది. అక్కడ మగవాళ్లే ఆడవాళ్లలా రెడీ అయి పూజలు చేయడం ఆసక్తిగా ఉంది.

మగ మహా భక్తులు.. ..
కేరళ రాష్ట్రంలోని కొల్లా జిల్లా చమయావిలక్కు గుడిలోనూ మగవాళ్లు ఆడ వేషధారణలో పూజలు చేసే సంప్రదాయం ఉంది. ఇక్కడ కూడా కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుల్లూరులో తరహాలోనే పురుషులు మహిళల వేషధారణలో గుడికి వచ్చి పూజలు చేస్తారు. సంతకుల్లూరులో కంటే అందంగా తయారవుతారు మగ మహాభక్తులు. ఆడవారికి ఏమాత్రం తీసుపోనట్లుగా, ఇంకా చెప్పాలంటే మగవారని ఏమాత్రం పోల్చుకోలేని రీతిలో ముస్తాబవుతారు. సాయంత్రం ఆలయానికి వచ్చి.. దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. ఇలా చేయడం వలన అంతా మంజే జరుగుతుందని స్థానికుల నమ్మకం. స్థానికులే కాకుండా చుట్టుపక్క ఊళ్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. తాత ముత్తాతల నుంచి ఈ ఆచారం ఉందని చెప్తున్నారు.

కర్నూలు జిల్లాలోనూ..
ఏదైనా కోరికలు తీరాలంటే.. మొక్కులు మొక్కుతాం. కోర్కెలు తీరాక నిలువు దోపిడీ ఇస్తాం, తలనీలాలు సమర్పిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుల్లూరులో దాదాపు 300 ఏళ్లుగా ఒక ఆచారం ఉంది. హోలీ సందర్భంగా దేశమంతా రంగులు చల్లుకుంటుంటే.. ఈ గ్రామంలో మాత్రం మగవాళ్లంతా చీరలు కట్టుకుని గుడికి వెళ్తారు. గ్రామంలో కొలువై ఉన్న రతీమన్మథులకు పూజలు చేస్తారు. పురుషులు ఆడవాళ్ల లాగా అలంకరించుకుని కుంభోత్సవంలో పాల్గొంటారు. హోలీ పండుగ రోజు పురుషులు స్త్రీల వేషంలో మన్మథస్వామిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని, కోరికలు నెరవేరతాయన్నది ఈ గ్రామస్తుల నమ్మకం.

ప్రస్తుతం చమయావిలక్కు గుడిలో మగ భక్తులు ఆడ వేషధారణలో పూజలు చేసే వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసినవారంతా వారంతా మగవాళ్లు అంటే నమ్మలేకపోతున్నాం అని కామెంట్స్‌ పెడుతున్నారు. నిజమేనా అంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular