Modi Amit Shah: దేశాన్ని పాలిస్తున్న పవర్ ఫుల్ వ్యక్తులు ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలు. దేశంలోనే టాప్ 1, 2లు వీరు. అలాంటి వారి దృష్టిలో తెలుగు రాజకీయాలంటే పిచ్చ లైట్. అందులో మన నేతలంటే అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అలాంటి జాతీయ నేతల మనసుల్లో మరి ముఖ్యంగా మన ఏపీ నేతలకు చోటు ఉందా? చంద్రబాబు, జగన్, పవన్ లలో ఎవరంటే వారికి ఇష్టం? వీరిలో ఎవరు బెటర్? అన్న దానిపై స్పెషల్ ఫోకస్..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయాలపై జోరుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి ప్రజలు చర్చించుకుంటున్నారట.. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్ళి సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ప్రజలను మభ్యపెడుతుంటారు. నిజంగానే వాళ్లు వెళ్లేది ప్రజాసమస్యల పైనేనా? అని ఒక్కోసారి ప్రజలకు కూడా అనుమానం వస్తోంది. అయితే, ప్రధాని మోడీ, అమిత్ షా తమను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఒక్కోసారి ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ వీరితో పాటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. మరి వీరికి ఎందుకు అపాయింట్ ఇవ్వలేదని చాలా మంది ఆలోచన చేయరు. ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి ప్రతినిధి.. ఆ రాష్ట్ర ప్రజలకు జవాబుదారి. ప్రధాని, కేంద్ర హోంమంత్రి అంటే 135కోట్ల భారతీయులకు జవాబుదారులు..

వీరు దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం, సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ముందే అపాయింట్ మెంట్ కోరకుండా నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని టైం అడిగితే ఇస్తారా? హోమంత్రిని కలువడం సాధ్యమా? ఇదే మన ముఖ్యమంత్రులు చేసే తప్పు.. తెలంగాణ సీఎం కేసీఆర్ మొన్నీమధ్య ధాన్యం కొనుగోలు, రైతాంగ సమస్యలు, విద్యుత్ బిల్లు గురించి మాట్లాడుతానని ఢిల్లీ వెళ్లి నాలుగు రోజులు తన పబ్బం గడుపుకుని వచ్చారు. ఆ తర్వాత తేలిందేమిటంటే అసలు కేసీఆర్ ప్రధాని అపాయింట్ మెంట్ కోరలేదట.. కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజల ప్రతినిధిగా వెళ్లొచ్చారు. కానీ ప్రధాని మోడీ దేశాన్ని, ప్రజల సంక్షేమాన్ని చూడాలి. ఓవైపు చైనా దురాక్రమణ, రష్యాతో ఒప్పందం, దాయాది పాక్ కవ్వింపులు, చమురు మార్కెట్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం, కరోనా భయం, వ్యాక్సినేషన్ ఇలా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆయనే చూసుకోవాలి. అలాంటప్పుడు ఎంత బిజీగా ఉండి ఉంటారో అర్థం చేసుకోవచ్చు..
ఇక జగన్ మాత్రం తెలివైన ముఖ్యమంత్రి. మోడీ, అమిత్ షాను కలవాలంటే ముందే లెటర్ రాస్తారు. ఆ తర్వాతే ఢిల్లీ వెళ్తారు. అపాయింట్ మెంట్ దొరకకపోతే తన ప్రొగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుంటారు. కేంద్రంతో దోస్తీ చేస్తూనే రాష్ట్ర సమస్యలు పరిష్కారం కోసం కృషిచేస్తుంటారు. ఇక మాజీ సీఎం చంద్రబాబు విషయానికొస్తే కేంద్రంతో పొత్తు ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. పొత్తు తెంచుకున్నాక కేంద్రంపై, ప్రధాని మోడీపై వ్యక్తిగత విమర్శలు చేయించారు. కన్న తల్లిని, కట్టుకున్న పెళ్లాన్ని చూసుకోలేనోడు దేశాన్ని ఏం పరిపాలిస్తాడని కామెంట్స్ చేయించారు. ఇక అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు ఆయన వాహనంపై రాళ్లు వేయించారు. వీటన్నింటినీ కేంద్రంలోని పెద్దలు గుర్తుపెట్టుకోరా?ఇప్పుడు మీకు ఇబ్బంది ఎదురైందని ఢిల్లీకి పోయి అపాయింట్ మెంట్ అడిగిన వెంటనే ఇస్తారా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు..
ఇక సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిస్తే షాక్ అయిపోతారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ పై కేంద్రంలోని పెద్దలకు మంచి అభిప్రాయమే ఉందట.. ఆయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్లిన ప్రధాని లేదా కేంద్ర హోంమంత్రి వీరిద్దరిలో ఎవరో ఒకరు అపాయింట్ ఇస్తారట.. కారణం పవన్ వ్యక్తిత్వమే.. లాస్ట్ టైం ఎన్నికల్లో ఓడిపోయాక పవన్ చేసిన కామెంట్స్ వారిని కదలించాయట.. తాను డబ్బులు ఇవ్వలేదు. మందు పోయలేదు. మనీ పాలిటిక్స్ చేయడానికి రాలేదు. అందుకే ఓడిపోయానని పవన్ చేసిన వ్యాఖ్యలు వారికి ఎంతో మెప్పించాయట..
Also Read: Telangana govt: యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేది లేదని చెబుతున్న రాష్ర్ట ప్రభుత్వం
అమిత్ షా, జేపీ నడ్డా ఎప్పుడు ఏపీ వచ్చినా పవన్ కళ్యాణ్ గురించి అడుగుతారట.. పవన్ జీ కైసా హే అని అడుగుతారట.. దీంతో ఏపీ లోకల్ బీజేపీ లీడర్స్ పలుమార్లు షాక్ అయ్యారట. పవన్‌ను ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు మోడీ, అమిత్ షాలు రెడీగా ఉన్నారని కూడా తెలిసింది. జాతీయవాద భావాలు కలిగిన పవన్ అంటే కేంద్రంలోని బీజేపీ పెద్దలకు చాలా అభిమానం అని కూడా తెలిసింది.కేసీఆర్, చంద్రబాబు కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తారని, నిజాయితీకి పెద్దగా విలువ ఇవ్వరని.. ఇక జగన్ కొంచెం బెటరని.. వీరందరి కంటే ఓడిపోయినా పవన్ కళ్యాణ్ బెటర్ అనే అభిప్రాయంతో ఉన్నారట ప్రధాని మోడీ, అమిత్ షా..
Also Read: AP New Capital: ఏపీకి నయా రాజధాని విశాఖ.. ముహుర్తం ఫిక్స్?