Homeఎంటర్టైన్మెంట్Telugu Cinema: తెలుగు సినిమా రంగాన్ని మార్చేసిన చిత్రాలు ఇవే !

Telugu Cinema: తెలుగు సినిమా రంగాన్ని మార్చేసిన చిత్రాలు ఇవే !

Telugu Cinema: నేటి సినిమా పండితులంతా కలిసి ఒక ముచ్చట పెట్టుకున్నారు. ఆ ముచ్చటలో ముఖ్యాంశం ఏమిటంటే.. తెలుగు సినిమా రంగాన్ని మార్చేసిన ఒక ఆరు చిత్రాలు ఏవి ? ఆ చిత్రాలే ఎలా మార్చాయి ? అంటూ ఒక ప్రశ్న వేసుకుని.. ఆ ప్రశ్న చుట్టూ ఆ సినిమాల సంగతులు చెప్పుకుంటూ మొత్తానికి ఒక ఆరు చిత్రాలను తేల్చారు. మరి ఆ చిత్రాలు ఏమిటో మనం చూద్దాం.

మిస్సమ్మ, గుండమ్మ కథ :

Films That Changed The Field of Telugu Industry
Gundamma Katha and Missamma

ఈ జాబితాలో రెండు చిత్రాలకు సమస్థానం ఇచ్చారండోయ్. కారణం స్క్రీన్‌ ప్లే అట. చిన్న కథావస్తువును రంజింపజేసే స్క్రీన్‌ ప్లేతో అద్భుతమైన చిత్రంగా మలచవచ్చని ఋజువు చేసిన సినిమాలు ఇవి, అందుకే, వీటికి మొదటి స్థానం ఇస్తున్నామని తేల్చి చెప్పారు. అన్నట్టు ఈ చిత్రాల గొప్పతనం చెప్పాలి అంటే.. మాటల్లో చిన్న చిన్న చమక్కులు, ఆహార్యం, ముఖవైఖరుల్లో సున్నితమైన విరుపులు, అద్భుతమైన నటన.. ఇలా అన్నీ వెరసి ఈ చిత్రాలు గొప్ప చిత్రాలుగా నిలిచిపోయాయి.

పాతాళ భైరవి, మాయాబజార్ :

Films That Changed The Field of Telugu Industry
Patala Bhairavi and MayaBazaar

ఇవి ఎందుకు గొప్ప చిత్రాలుగా నిలిచాయి అని ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. ప్రతి తెలుగు వాడికి తెలుసు. కంప్యూటర్లు లేని కాలంలో కళ్ళను కట్టిపడేసే గ్రాఫిక్స్ కేవలం ఈ చిత్రాలతోనే సాధ్యం అయింది అని. పైగా సృజన ఆకాశమంతైనా తెరపై చూపటం అనేది హాలీవుడ్‌కే కాదు, తెలుగు వాళ్లకు సాధ్యమే అని నిరూపించిన మొదటి చిత్రాలు ఇవి.

మల్లీశ్వరి :

Films That Changed The Field of Telugu Industry
Malleswari

ఎన్టీఆర్, భానుమతి గారి నట విశ్వరూపం ఆవిష్కరించిన సినిమా ఇది. పైగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడిన మొట్టమొదటి తెలుగు సినిమా కూడా ఇదే.

శంకరాభరణం :

Films That Changed The Field of Telugu Industry
Shankarabharanam

సంగీతం ప్రధానంగా, తెలుగు సినీ పరిశ్రమకు ఒక కొత్త కథానాయకుడి తరహాను, అప్పటి దాకా వచ్చిన కథాచారాలకు విరుద్ధమైన కథాంశాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి సినిమా. అందుకే ఈ సినిమాకు ఈ జాబితాలో స్థానం లభించింది.

ఖైదీ :

Films That Changed The Field of Telugu Industry
Khaidi

మాస్ సినిమాలకు తొడగొట్టి ఉనికిని చాటుకునేలా చేసిన సినిమా ఇది. పైగా చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన సినిమా ఇది.

శివ :

Films That Changed The Field of Telugu Industry
Shiva

ఈ సినిమా గురించి ఏం చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా రూపురేఖలను మార్చిన సినిమా ఇది. చిత్రీకరణ, హీరోయిజం, విలనిజంలలో కొత్త శకానికి తెర తీసిన సినిమా ఇది.

Also Read: తెలుగు హీరోలను జస్టిస్ ఎన్వీ రమణ అంత మాటన్నాడా..?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular