కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ తో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడం.. చిరుద్యోగులు ఇబ్బందులకు గురికావడం ప్రతీఒక్కరికి అనుభవం అయ్యే ఉంటుంది. ఇదే కథాంశంతో ఫేస్ బుక్ తాజాగా ఓ లఘచిత్రం రూపొందించింది. కేవలం ఏడు నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ ఫేస్ బుక్ లఘచిత్రం ప్రతీఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది.
Also Read: దర్శకుడికి మహేష్ దీపావళి గిప్ట్.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్..!
‘బదాయిహో’ దర్శకుడు అమిత్ శర్మ ‘ఫేస్ బుక్’ లఘు చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఇక కథ విషయానికొస్తే.. పంజాబ్ లోని అమృత్ సర్ చెందిన పూజ మిల్క్ సెంటర్ నడిపిస్తూ ఉంటుంది. పాలు.. పాల ఉత్పత్పులను అమ్మి జీవనం సాగిస్తుంది. సాఫీగా సాగిపోతున్న ఆమె వ్యాపారంపై లాక్డౌన్ ప్రభావం పడుతుంది.
అదే సమయంలో కరోనాతో ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి కల్పించేందుకు పూజా ఫేస్ బుక్ లో పోస్టు పెడుతుంది. ఇది చూసిన చాలామంది నెటిజన్లు ఆమె దగ్గరకు ఉపాధి కోసం వస్తారు. అయితే ఆమెకు ఒకరిద్దరు మాత్రమే అవసరం. అయినప్పటికీ వచ్చిన వాళ్లను ఆమె ఉన్నంత సర్దుబాటు చేస్తోంది. దీనిని చూసిన పూజ సోదరుడు ఆమెను వ్యతిరేకిస్తాడు.
Also Read: ‘అమ్మోరు తల్లి’ రివ్యూ.. హిట్టా? ఫ్లాపా?
లాక్డౌన్ ఎఫెక్ట్ వ్యాపారంపై బాగా పడటంతో ఆమె తన కారును అమ్ముకోవాల్సి వస్తుంది. దీంతో ఆమె సోదరుడు మళ్లీ ఆమెతో గొడవపడుతాడు. ఈ సంఘటన ఉద్యోగుల కంటపడుతుంది. దీంతో తమ వాళ్ల పూజ ఇబ్బందులు పడుతుందని గ్రహించిన ఉద్యోగులు ఫేస్ బుక్ లో ఓ వీడియో షేర్ చేస్తారు.పూజా మిల్క్ సెంటర్లో పాలు, పాల ఉత్పత్తులు కొనుగోలు చేసి తమకు సాయం అందించాలని సదరు ఉద్యోగులు కోరారు.
ఈ వీడియో వైరల్ కావడంతో తెల్లరేసరికి దుకాణం ముందుకు వినియోగదారులు పెద్దఎత్తున క్యూ కడుతారు. ఇది చూసిన పూజ సోదరుడు తన తప్పు తెలుసుకొని కన్నీటి పర్యాంతం అవుతాడు. పూజ మొహంలో చిరునవ్వు చిందడంతో లఘుచిత్రం ఎండ్ అవుతుంది. ఫుల్ ఎమోషన్ లా సాగిన ‘ఫేస్ బుక్’ లఘుచిత్రం లాక్డౌన్ కష్టాలను మళ్లీ గుర్తుచేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్