Homeఆంధ్రప్రదేశ్‌ఇన్ టాక్ : చీరాల, గన్నవరంలో వైసిపి వర్గపోరు

ఇన్ టాక్ : చీరాల, గన్నవరంలో వైసిపి వర్గపోరు

YSRCP clarified on alliance with BJP, says party will fight next election  alone in state - India News

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు విస్తరిస్తోంది అన్న వార్తలు వింటూనే ఉన్నాం. చాపకింద నీరులా వర్గపు అనేది వైసీపీలో చల్లగా పాకుతోంది. వైఎస్ వర్ధంతి సందర్భంగా కృష్ణా, ప్రకాశం జిల్లాలలో వైసీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బయటకు వచ్చాయి. 

ప్రకాశం జిల్లాలో కరణం, ఆమంచి వర్గాల మధ్య ఉన్న వైరం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అది మరొకసారి బయటపడింది. వైసిపి వర్ధంతి సందర్భంగా కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత నాయకులు కార్యకర్తలు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇస్తామని గతంలో లాగా అరాచకాలు బెదిరింపులు సాగవని…. ఇక అలా కాదని బెదిరిస్తే చూస్తూ కూర్చోమని… జాగ్రత్తగా ఉండమని ఆమంచిని ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. అభివృద్ధి కోసమే వైసీపీలోకి వచ్చామని చెప్పి…. బాలినేని శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి చీరాల అభివృద్ధి చేసుకుందాం అని వెంకటేష్ పిలుపునిచ్చారు. 

అయితే ఈ వ్యాఖ్యలకు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తీవ్రంగానే స్పందించారు. తన పేరుని ఉచ్చరించడానికి భయపడే వాళ్ళు కూడా ఇలా వార్నింగ్ లు ఇస్తున్నారని… చివరికి జగన్ పార్టీలో చేరి వీరంతా బ్రతికి పోయారు…. అని ఆయన తనదైన శైలిలో స్పందించారు. అధికారం లేకపోతే బ్రతకలేని వాళ్లు నా గురించి ఇలా మాట్లాడేవారే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక గన్నవరం లో కూడా వైసిపి వర్గ పోరు రోజురోజుకూ తీవ్రమవుతుంది. ఇక్కడ కూడా వైయస్ వర్ధంతి సందర్భంగానే పార్టీ నేతల మధ్య విభేదాలు బట్టబయలు కావడం గమనార్హం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ,  వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య ఉన్న విబేధాలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఉంగుటూరు మండలం తేలప్రోలు లో వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేయడంతో వివాదం రాజుకుంది. 

మంత్రులు, ఎమ్మెల్యేలు రాకముందే దుట్టా వర్గీయులు పూల మాలలు వేయడంతో వంశీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వంశీ తీరుపై దుట్టా కూడా తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు సీఎం వైఎస్ జగన్ కు వంశీని తాను పరిచయం చేశానని వైఎస్ కుటుంబానికి తాను సన్నిహితుతుడినని దుట్టా అన్నారు. పార్టీని నమ్ముకుని బ్రతికున్నంత కాలం వైసీపీలోనే ఉంటామని అన్నారు. టిడిపి నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే సహించబోయేది లేదని…. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నేనే అని ఆయన ప్రకటించుకోవడం గమనార్హం. ఇక అసలే అమరావతి అగ్గి బాగా రాజుకుంటున్న దశలో జిల్లా ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో అంతర్గత విభేదాలు వైసీపీ ని చూసి చూసి చావుదెబ్బ కొడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version