కత్తి మహేష్ మరణంలో మైనింగ్ డీల్?

రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సినీ విమర్శకుడు, దర్శకుడు, నటుడు కత్తి మహేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు అంత రాత్రి వారు ప్రయాణించాల్సిన అవసరం ఏమిటనే సందేహాలు వస్తున్నాయి. దీనిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిక అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ మృతిపై ఏ విచారణకైనా సిద్ధమేనని ఆంధప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. వైద్యం కోసం రూ.17 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఏ […]

Written By: Srinivas, Updated On : July 16, 2021 1:42 pm
Follow us on

రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సినీ విమర్శకుడు, దర్శకుడు, నటుడు కత్తి మహేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు అంత రాత్రి వారు ప్రయాణించాల్సిన అవసరం ఏమిటనే సందేహాలు వస్తున్నాయి. దీనిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిక అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ మృతిపై ఏ విచారణకైనా సిద్ధమేనని ఆంధప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. వైద్యం కోసం రూ.17 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఏ రకమైన సహాయం చేయడానికైనా రెడీ అని ప్రకటించింది.

కత్తి మహేస్ దళిత జాతిలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ పార్టీ సానుభూతి పరుడు అని తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికలో కూడా ప్రచారం చేశారు. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని దళిత సంఘాలు చెబుతున్న నేపథ్యంలో మంత్రి సురేష్ ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే విచారన జరిపిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదం సమయంలో ఆయన పక్కన ఉన్న వ్యక్తి సురేష్ ఎవరు? కత్తి మహేష్ కు ఆయనకు సంబంధం ఏమిటి? ఇద్దరు ఎందుకు చిత్తూరు వెళుతున్నాు అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

సురేష్ పై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో గురువారం పోలీసులుఆయనను విచారించారు. ఈ క్రమంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సురేష్ కత్తి మహేష్ కు వ్యాపార బాగస్వామి అని తెలిసింది. ఇద్దరు కలిసి మైనింగ్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా ఉదయమాణిక్యం గ్రామంలో మైనింగ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఎన్ వోసీ కోసం ఎమ్మార్వో కార్యాలయం నుంచి పిలుపు రావడంతో బయలుదేరామని చెప్పారు. ఎన్ వోసీ రావాలంటే గ్రామసభ పెట్టాల్సిందిగా సూచించారు. గ్రామసభ కోసం ఎంపీడీవో మమ్మల్ని పిలిచారు. దీంతో రాత్రి ఇద్దరం కలిసి వెళ్లామని పేర్కొన్నారు.

ఏది ఏమైనా కత్తి మహేష్ మరణం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దర్శకుడిగా, నటుడిగా, విమర్శకుడిగా ఎన్నో కార్యక్రమాలు చేసిన మహేష్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరమే. దీంతో ఆయన చేసిన పలు కార్యక్రమాలు ప్రజల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. నటుడిగా కూడా ఆయన మెప్పించారు. దర్శకుడిగా తన ప్రతిభ చూపించారు. విమర్శకుడిగా అయితే ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు. విధి ఆడిన వింత నాటకంలో కత్తి మహేష్ పాత్రధారి కావడం బాధాకరం.