https://oktelugu.com/

వైరల్: బ్రా వేసుకోలేదని యువనటికి ట్రోలింగ్

మరాఠీ నటి హేమాంగి కవి తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ భామ ‘చపాతీ’ చేసే వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోలో ‘బ్రా’ ధరించనందుకు నెటిజన్లు ఆమెను కామెంట్ చేస్తూ ట్రోల్ చేశారు. హేమాంగి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో సమస్యలను లేవనెత్తడంలో ముందుంటుంది. ఎవరైనా నెటిజన్లు ట్రోల్ చేస్తే వారికి గట్టిగా సమాధానాలు ఇవ్వడంలో వెనక్కి […]

Written By:
  • NARESH
  • , Updated On : July 15, 2021 / 09:35 PM IST
    Follow us on

    మరాఠీ నటి హేమాంగి కవి తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ భామ ‘చపాతీ’ చేసే వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోలో ‘బ్రా’ ధరించనందుకు నెటిజన్లు ఆమెను కామెంట్ చేస్తూ ట్రోల్ చేశారు.

    హేమాంగి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో సమస్యలను లేవనెత్తడంలో ముందుంటుంది. ఎవరైనా నెటిజన్లు ట్రోల్ చేస్తే వారికి గట్టిగా సమాధానాలు ఇవ్వడంలో వెనక్కి తగ్గరు. హేమాంగి ఇటీవల ఒక వీడియో షేర్ చేయగా.. అందులో బ్రా వేసుకోలేదని ట్రోల్ కు గురైంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె చపాతీ చేస్తున్న వీడియో షేర్ చేయడంతో కొందరు పనిలేని నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు.

    దీనిపై సీరియస్ అయిన హేమాంగి తనని ట్రోల్ చేసిన వారికి గట్టి సమాధానం ఇచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఘాటు పోస్ట్ చేసింది. ‘బ్రా ధరించాలా లేదా అనేది తన ఆప్షన్ అని ఆమె చెప్పుకొచ్చింది. ‘‘అవును, నాకు రొమ్ములు ఉన్నాయి. పురుషుల మాదిరిగానే అవి ఉంటాయని’ పేర్కొంది. నేను పాలిచ్చి పెంచే జాతికి చెందిన దాన్ని కాబట్టి నా కాళ్లు, చేతులు కదిలేటప్పుడు నా వక్షోజాలు కదులుతాయి’ అని ఘాటుగా పేర్కొంది. ఇక ఆమె వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేసింది. అసలు బూ**స్ కదలని ఆడవారికి నమస్కరించాలని ఆమె అన్నారు.

    హేమంగి కవి తనదైన టాలెంట్ తో మరాఠీ , హిందీ సినిమాల్లో, టెలివిజన్ ప్రపంచంలో ప్రేక్షకుల ప్రశంసలను గెలుచుకుంటోంది. ఈ ట్రోల్ ల విషయంలో నటి సమాధానానికి దర్శకుడు ప్రవీణ్ టార్డే.. తాజాగా హేమంగికి మద్దతు ఇచ్చారు. దర్శకుడు టార్డే ఆమె బోల్డ్ పోస్ట్ గురించి ప్రశంసించారు.