సీరియల్స్ రేటింగ్స్: టాప్ లో మళ్లీ ఇదే

ఆడవాళ్ల ప్రపంచంలోకి మీరు ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే సీరియల్స్ చూడాల్సిందే. అందులోని సెంటిమెంట్స్, ఏడుపులు,పెడబొమ్మలకు షాక్ తినాల్సిందే. ఎక్కడలేని సెంటిమెంట్ ను అన్వయించుకోవాల్సిందే.. ఇప్పుడున్న రోజుల్లో సినిమాల కంటే టీవీ సీరియల్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు మహిళలు మాత్రమే చూసే సీరియల్స్ ను ఇప్పుడు పురుషులు కూడా క్రమం తప్పకుండా చూస్తున్నారు. రోజు రోజుకు ట్విస్టుల మీద ట్విస్టుల ఇస్తూ.. సస్పెన్ష్లతో ఆకట్టుకుంటున్న సీరియల్స్ చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల సీరియల్ టీఆర్పీ రేటింగ్ ను […]

Written By: NARESH, Updated On : July 16, 2021 11:45 am
Follow us on

ఆడవాళ్ల ప్రపంచంలోకి మీరు ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే సీరియల్స్ చూడాల్సిందే. అందులోని సెంటిమెంట్స్, ఏడుపులు,పెడబొమ్మలకు షాక్ తినాల్సిందే. ఎక్కడలేని సెంటిమెంట్ ను అన్వయించుకోవాల్సిందే.. ఇప్పుడున్న రోజుల్లో సినిమాల కంటే టీవీ సీరియల్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు మహిళలు మాత్రమే చూసే సీరియల్స్ ను ఇప్పుడు పురుషులు కూడా క్రమం తప్పకుండా చూస్తున్నారు. రోజు రోజుకు ట్విస్టుల మీద ట్విస్టుల ఇస్తూ.. సస్పెన్ష్లతో ఆకట్టుకుంటున్న సీరియల్స్ చాలానే ఉన్నాయి.

అయితే ఇటీవల సీరియల్ టీఆర్పీ రేటింగ్ ను విడుదల చేశారు. ఓవరాల్ గా ఎప్పటిలాగే బుల్లితెరపై వంటలక్క దూసుకుపోతోంది. మాటీవీలో ప్రసారమయ్యే ‘కార్తీక దీపం’ సీరియల్ అన్నంటికంటే ముందు వరుసలో ఉంది. అయితే మిగతా సీరియళ్ల రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.. తెలుగు బుల్లితెరపై వంటలక్కను కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు సాామీ అని ప్రత్యర్థి సీరియళ్ల వారు అనుకుంటున్నారట..

స్టార్ మాటీవీలో ప్రసారమ్యే అన్ని సీరియల్స్ దూసుకుపోతున్నాయి. అన్నింటికంటే టాప్లో కార్తీక దీపం సిటీలో 16.26, రూరల్లో 15.66 రేటింగ్ నమోదైంది. దీని తరువాత ఇంటింటి గృహలక్ష్మి అర్బన్లో 12.57, రూరల్ లో 12.29 నమోదైంది. ఇక గుప్పెడంత మనసు అర్బన్ 10.67, రూరల్ 10.79…దేవత అర్బన్ 9.42, రూరల్ 8.68 రేటింగ్ సొంతం చేసుకుంది. జానకి కలగనలేదు అర్బన్ 9.10 , రూరల్ 8.75 రేటింగ్ నమోదైంది.

ఈటీవీలో ప్రసారమయ్యే ‘యమలీల’ టాప్ ప్లేసును ఆక్రమించింది. ఈ సీరియల్ అర్బన్ 5.44, రూరల్ 5.14 రేటింగ్ నమోదు చేసుకుంది. నాపేరు మీనాక్షి అర్బన్ 5.25, రూరల్ 4.93.. మనసు మమత అర్బన్ 4.98, రూరల్ 4.61 రేటింగ్ సాధించింది. జీతెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్లో త్రినయనిని మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ సీరియల్ అర్బన్ ఏరియాల్లో 7.78, రూరల్ లో 9.07గా నమోదైంది. ఆ తరువాత నెం.1 కోడలు అర్బన్ 7.01, రూరల్ 8.19… ప్రేమ ఎంత మధురం అర్బన్ 6.43, రూరల్ 8.53 రేటింగ్ నమోదు చేసుకుంది.

ఇక జెమిని టీవీలో ప్రసారమయ్యే సీరియళ్లు చాలా వెనుకబడి ఉన్నాయి. ఇందులో ప్రసారమయ్యే సీరియళ్లు మిగతా సీరియల్స్ తో కనీస పోటీకూడ పడలేకపోయాయి. ఇందులో ప్రసారమయ్యేవి 1 కంటే తక్కువ స్థాయిలో రేటింగ్ నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే ‘కార్తీక దీపం’ టాప్ ప్లేసులోనే కొనసాగుతోంది. ఆ తరువాత ఇంటింటి గృహ లక్ష్మి సెకండ్ ప్లేసులో ఉంది.