పాకిస్థాన్ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇదేనా?

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన వక్రబుద్దిని మరోసారి బయటపెట్టారు. ఆయన ఓ దేశానికి ప్రధాని అన్న విషయం కూడా మర్చిపోయినట్లుగా కన్పిస్తుంది. ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తింపు పొందిన బిన్ లాడెన్ ను పార్లమెంట్ సాక్షిగా ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడు అంటూ కొనియాడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆయన వ్యాఖ్యలపై పాకిస్థాన్లోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఒక ఉగ్రవాదిని అమరుడు అని కొనియాడటం ద్వారా ప్రపంచ దేశాల ముందట పాకిస్థాన్ ను తలదించుకోనులా చేశారని ఆయనపై ప్రతిపక్షాలు […]

Written By: Neelambaram, Updated On : June 26, 2020 2:23 pm
Follow us on


పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన వక్రబుద్దిని మరోసారి బయటపెట్టారు. ఆయన ఓ దేశానికి ప్రధాని అన్న విషయం కూడా మర్చిపోయినట్లుగా కన్పిస్తుంది. ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తింపు పొందిన బిన్ లాడెన్ ను పార్లమెంట్ సాక్షిగా ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడు అంటూ కొనియాడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆయన వ్యాఖ్యలపై పాకిస్థాన్లోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఒక ఉగ్రవాదిని అమరుడు అని కొనియాడటం ద్వారా ప్రపంచ దేశాల ముందట పాకిస్థాన్ ను తలదించుకోనులా చేశారని ఆయనపై ప్రతిపక్షాలు మండిపడిపోతున్నాయి.

చైనా కాచుకో.. భారత్ కు అమెరికా బలగాలు!

పాకిస్థాన్ కు చెందిన బిన్ లాడెన్ అల్ ఖైదా సంస్థను స్థాపించారు. ఈ సంస్థ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రపంచ దేశాలకు సవాల్ విసిరాడు. భారత్, అమెరికా సహా అనేక దేశాల్లో అనేక మరణహోమాలను సృష్టించిన సంగతి తెల్సిందే. ఆల్ ఖైదా 2001 సెప్టెంబర్ 9న అమెరికా ఎయిర్ లైన్స్ ను హైజక్ చేసి పెంటగాన్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడిచేసింది. ఈ సంఘటనలో 25వేలమంది గాయపడగా 2,996మంది మృత్యువాతపడ్డారు. ఈ వార్త తెలిసి ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆల్ ఖైదాను అన్నిదేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.

సెప్టెంబర్ 11దాడులకు ముందువరకు అమెరికాకు పాకిస్థాన్ మిత్రదేశంగానే ఉండేది. ఈ సంఘటన తర్వాత ఇరుదేశాల మధ్య దూరం పెరిగింది. పాకిస్థాన్ అసలు స్వరూపం గ్రహించిన అమెరికాకు మెల్లిమెల్లిగా ఆ దేశాన్ని దూరం పెడుతూ వచ్చింది. అదేవిధంగా తమ దేశంలో దాడులకు పాల్పడిన బిన్ లాడెన్ పట్టుకుకొని హతమారుస్తామని అమెరికా ప్రకటించింది. ఆ తర్వాత బిన్ లాడెన్ తమ దేశంలో లేడని పాకిస్థాన్ అమెరికాను నమ్మించే యత్నం చేసింది.

వైసీపీకి కొత్త చిక్కులు తెచ్చిన షోకాజ్ నోటీస్..!

బిన్ లాడెన్ పాకిస్థాన్లో ఆశ్రయం పొందుతున్న విషయాన్ని అమెరికా నిఘా సంస్థలు పసిగట్టాయి. పక్కా ప్రణాళికతో 2011లో పాకిస్థాన్‌కు ఏమాత్రం సమాచారమివ్వకుండా సొంత ఆపరేషన్‌ తో అబోటాబాద్‌లో లాడెన్‌ను అమెరికా బలగాలు హతమార్చాయి. బిన్ లాడెన్ మృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఒక్కరు కూడా సానుభూతి వ్యక్తం చేయలేదు.

తాజాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన వక్రబుద్దిని మరోసారి బయటపెట్టాడు. పాకిస్థాన్ పార్లమెంట్లో లాడెన్‌ను అమెరికా హతమార్చిన విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2011 తర్వాత అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు ఎంతలా దిగజారాయో చెబుతూ లాడెన్‌ను అమరవీరుడిగా ఇమ్రాన్ ఖాన్ సంబోధించాడు. అమెరికన్లు అబోటాబాద్ వచ్చి లాడెన్‌ను చంపేసి అతడిని అమరవీరుడిని చేశారని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించడం తీవ్ర దూమారాన్ని రేపుతోంది. ఆయన వ్యాఖ్యల పై పాకిస్థాన్‌ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద ఘటనలతో ముస్లింలపై ఓవైపు వివక్ష కొనసాగుతుండగా ఓ ఉగ్రవాదిని అమరుడిగా కీర్తించడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పు పడుతున్నారు. ఆయన ప్రధాని అన్న విషయం మరిచిపోయి మాట్లాడుతున్నారని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలతో మరోసారి పాకిస్థాన్ ప్రపంచం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చిందనే అభిప్రాయం పాకిస్థానీయుల్లో వ్యక్తమవుతోంది.