వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం కొరివితో తల గోక్కునట్లు తయారైంది. ప్రతి విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం, సీఎం జగన్ ను కలిసే అవకాశం లేదని, ఆయన చుట్టూ కోటరీ ఉందని విమర్శలు చేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ షోకాజ్ నోటీసుకు ఎంపీ సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంలో ఎంపీ లేవనెత్తిన విషయాలు వైసీపీకి కొత్త సమస్యలు తెచ్చి పెట్టాయి.
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ తప్పదా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత వ్యవహారాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించారు. పార్టీ ఏర్పాటు చేసి తొమ్మిది సంవత్సరాలు పూర్తయినా నేటికి పార్టీ క్రమశిక్షణ సంఘం లేకపోవడం, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పార్టీ నిర్వహణ, సమావేశాలు నిర్వహించడం లేదనే విషయం వెల్లడైంది. ఇది ఆ పార్టీ విషయంలో ప్రతిపక్ష పార్టీలకు మరో అస్త్రం దొరికినట్లయ్యింది.
టీడీపీ ఎమ్మెల్యేలను అనధికారికంగా పార్టీలోకి తీసుకుని వారిచేతే టీడీపీ పార్టీని, అధినేత చంద్రబాబు, లోకేషలను తిట్టిస్తున్నారని వాపోతున్న ప్రతిపక్షం, ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంతో ఆ పార్టీకి తగిన శాస్తి జరిగిందని భావిస్తోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి.
మాటల్లో స్నేహం, చర్యల్లో యుద్ధం..వైసీపీ ఎంపీ తీరిదే..!
మరోవైపు అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసలైన వైఎస్సార్ సీపీ తమదేనని, సీఎం జగన్ నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు పార్టీ మా పార్టీ పేరును వాడుకొంటున్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా పేర్కొన్నారు. 2015లో ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని ఆ పేరును వాడుకోవద్దని అప్పుడే ఎన్నికల సంఘం ఆదేశించిందని చెప్పారు. ఇది ఇలా ఉంటే వైసీపీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇంతటితో సర్దుకుంటుందో… లేక కొత్త రంగు పులుముకుంటుందా అనే అంశం తెలియాలంటే వేచి చూడాల్సిందే.