https://oktelugu.com/

ఏపీలోనీ ఆ జిల్లాలపై ‘యాస్’ తుఫాను ప్రభావం…

ఆంద్రప్రదేశ్ వైపు ‘యాస్’ ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న 12 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం, పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంగవరం, కాకినాడ పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘యాస్’ పేరుతో వస్తున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : May 26, 2021 / 10:21 AM IST
    Follow us on

    ఆంద్రప్రదేశ్ వైపు ‘యాస్’ ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న 12 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం, పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంగవరం, కాకినాడ పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    ‘యాస్’ పేరుతో వస్తున్న ఈ తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు పడుతాయన్నారు. ‘యాస్’ ప్రభావం రాష్ట్రంపై ఒకరోజు ఉంటుందని, రేపు ఒడిశా, బెంగాల్ సాగర్ వైపు వెళ్లనుందని వారు వెల్లడించారు.

    ఇదిలా ఉండగా ఏపీలో తుఫాను ప్రభావంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సమీక్ష చేశారు. అయితే తుఫాను హెచ్చికలు జారీ చేసిన ప్రాంతాల్లో అధికారులు మరింత అలర్ట్ గా ఉండాలని సూచించారు.