Shashi Tharoor
Shashi Tharoor: చంద్రుడిపై భారత్ జెండా ఎగరడంతో ప్రపంచమంతా ఇండియా గురించి చర్చించుకుంటున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)శాస్త్రవేత్తల ఘనతపై దేశ, విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ తరుణంలో రాజకీ, సినీ, క్రికెట్ ఇలా అన్ని వర్గాల వారు ఇస్త్రోశాస్త్రవేత్తలను కొనియాడుతున్నారు. ఈ తరుణంలో తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చంద్రయాన్ -3ను ప్రయోగించిన శాస్త్రవేత్తలు కేరళ ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన వారేనని అన్నారు. ఇక్కడి కళాశాల అందించిన నైపుణ్యంతోనే వారు ఈరోజులు అత్యున్నతస్థాయికి ఎదిగారని అన్నారు. అయితే ఐఐటీ చదివిన వారు అమెరికాకు వెళ్తుంటే కేరళలో ఇంజనీరింగ్ చదివిన వారు ఇస్రోకు వెళ్తున్నారని అన్నారు.
చంద్రయాన్ 3 ప్రయోగం చేసిన శాస్త్రవేత్తల్లో చీఫ్ డాక్టర్ సోమనాథ్ కేరళలోని కొల్లం TKM కళాశాలలో చదివారు. అతని సహచరులు తిరువనంతపురంలోని ఇంజనీరింగ్ కళాశాలలో (CET) నుంచి పట్టా తీసుకున్నారు. ఇందులో CET నుంచి మరో ఏడుగురు ఇంజనీర్లు ఇందులో పాల్గొన్నారు. వీరిలో మోహన్ కుమార్ (మిషన్ డైరెక్టర్), అతుల (ఎలక్ట్రానిక్స్), సతీష్ (మెకానికల్), నారాయణన్ (అసోసియేట్ మిషన్ డైరెక్టర్), మోహన్ ( మెకానికల్), షోరా (ఎలక్ట్రానిక్స్) చదివారిన శశిథరూర్ తన X ఖాతాలో పేర్కొన్నారు.
భారతదేశంలోని విద్యార్థులు ఐఐటీ చదవడానికి చాలా మంది ఇష్టపడుతున్నారని, అలాంటి వారికి కేరళలో ఇంజనీరింగ్ కళాశాల వెన్నెముకగా నిలుస్తుందన్నారు. ఇక్కడ విద్యనభ్యసించిన వారు భారత ప్రభుత్వ రంగానికి అనేక సేవలు చేస్తున్నారని అన్నారు. మా కళాశాలలో చదివి.. చంద్రయాన్ -3 విజయవంతం చేసిన వారికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ‘ఐఐటీయన్లు సిలికాన్ వ్యాలికి వెళ్లారు.. సీఇటియన్లు మమ్మల్ని చంద్రునిపై తీసుకెళ్లారు..’ అంటే తన పోస్టులో మెసేజ్ పెట్టారు. అంటే ఉన్నత స్థాయిలో వివిధ కళాశాలల్లో చదివిన విద్యార్థులు తమ సేవలను విదేశాల్లోకి వెళ్లి వారికి సాయపడుతున్నారన్నారు. కానీ కేరళలో చదివిన వారు మాత్రం దేశ సేవ చేస్తున్నారని పేర్కొన్నారు.
చంద్రయాన్ 3 విజయం తరువాత న్యూయార్క్ టైమ్స్ నుంచి బీబీసీ వరకు విదేశీ మీడియా సంస్థలన్నీ శాస్త్రవేత్తలను ప్రశంసిస్తున్నాయి. అంతరిక్షంలో ప్రయాణించే దేశంగా పేరుకు తీసుకురావడం గొప్ప క్షణం అని అభివర్ణించారు. ఈ సందర్భంగా ఇస్త్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తమ సహచరులతో ఐదో వంతు జీతం పొందడం ద్వారా ఈ చారిత్రాత్మక విజయం సాధించారని అన్నారు.