Shruti Haasan: సలార్ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన శృతి హాసన్..!

సలార్ చిత్రంపై ఉన్న హైప్ కి ఇది నిదర్శనం. సలార్ సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. అనుకున్న సమయానికి సలార్ రాదు. వర్క్ ఇంకా పూర్తి కాలేదని ఆ మధ్య ఓ ప్రచారం జరిగింది.

Written By: Shiva, Updated On : August 25, 2023 3:16 pm

Shruti Haasan

Follow us on

Shruti Haasan: బాహుబలి తర్వాత ప్రభాస్ కి హిట్ లేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ నష్టాలు మిగిల్చాయి. ప్రభాస్ రేంజ్ మూవీ పడలేదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సలార్ మూవీతో ప్రభాస్ అందరికీ సమాధానం చెప్పబోతున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ బాక్సాఫీస్ దుమ్ముదులపడం ఖాయం అంటున్నారు. సలార్ ఓ రేంజ్ లో ఉండనుందని టీజర్ తో తెలిసిపోయింది. నెల రోజుల ముందే యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రభాస్ కుమ్మేస్తున్నాడు.

సలార్ చిత్రంపై ఉన్న హైప్ కి ఇది నిదర్శనం. సలార్ సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. అనుకున్న సమయానికి సలార్ రాదు. వర్క్ ఇంకా పూర్తి కాలేదని ఆ మధ్య ఓ ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు కొట్టిపారేశాలా హీరోయిన్ శృతి హాసన్ దిమ్మతిరిగే అప్డేట్ ఇచ్చింది. సలార్ చిత్ర డబ్బింగ్ లో ఆమె పాల్గొంటున్నారు. సలార్ ఐదు భాషల్లో విడుదల అవుతుండగా ఒక్కో లాంగ్వేజ్ కి డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తుంది.

సలార్ డబ్బింగ్ పనులు మొదలయ్యాయని తెలుస్తున్న నేపథ్యంలో సలార్ వాయిదా పడే ఛాన్స్ లేదని అర్థం అవుతుంది. కాబట్టి మరో నెల రోజుల్లో సలార్ థియేటర్స్ లో దిగనుంది. ట్రైలర్ కట్ ఆల్రెడీ పూర్తి అయ్యింది. సలార్ ట్రైలర్ చూసిన సినిమా వర్గాలు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బిజినెస్ లెక్కలు అన్నీ మారిపోతాయి. సలార్ ట్రైలర్ అతిపెద్ద సునామీ సృష్టించనుందని చెబుతున్నారు.

సలార్ సైతం రెండు భాగాలుగా విడుదల కానుందట. ఈ చిత్రంలో కీలక రోల్ చేస్తున్న జగపతిబాబు ఈ విషయం వెల్లడించారు. ఇది కేజిఎఫ్ వేర్స్ లో భాగమే అంటున్నారు. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నాడు. మొత్తంగా సలార్ అభిమానుల దాహం తీర్చే సినిమా అవుతుందని అంటున్నారు. నెగిటివ్ టాక్ తో కూడా ప్రభాస్ చిత్రాలు వందల కోట్లు కొల్లగొడతాయి. ఇక పాజిటివ్ టాక్ వస్తే ఆపడం కష్టమే….