IISC Professor Madhavi Latha: చీనాబ్ నది మీద నిర్మించిన వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల జాతికి అంకితం చేశారు. ఈ వంతెన సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు మొన్నటి నుంచి మీడియాలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈవంతనకు సంబంధించి అనేక విషయాలను జాతీయ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ వంతెన నిర్మాణ క్రతువులో ఒక మహిళ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.. ఆమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు. ఒక రకంగా తన జీవితంలో అత్యంత కీలక దశను ఆమె ఈ ప్రాజెక్టు కోసం అంకితం చేశారంటే అతిశయోక్తి కాదు.. చీనాబ్ వంతెన నిర్మాణంలో కీలకంగా పనిచేసిన ఆ ప్రొఫెసర్ పేరు మాధవి లత .. ఇంతకీ ఈమె ఎవరు? నేపథ్యం ఏమిటి? తెలంగాణకు ఈమెకు ఎటువంటి సంబంధం ఉంది? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
Also Read: భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత రైల్వే వంతెన. ఈ వంతెన ఉదంపూర్ – బారాముల్లా – శ్రీనగర్ రైల్వే లింకులను కలుపుతుంది. ఈ ప్రాజెక్టును 2003లో ఆమోదించారు.. ఇక ఈ వంతెన నిర్మాణం విజయవంతం కావడానికి ప్రధాన కారకులలో ఒకరు ప్రొఫెసర్ జి. మాధవి లత. ఈమె బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. అయితే చీనాబ్ వంతెన నిర్మాణంలో ఆమె జియో టెక్నికల్ కన్సల్టెంట్ గా పని చేశారు. దాదాపు 17 సంవత్సరాలు ఆమె ఈ క్రతువులో పాల్గొంది. ఈ వంతెన నిర్మించిన కాంట్రాక్టు సంస్థ ఆఫ్కాన్స్ తో కలిసి ఆమె పని చేశారు. వంతెన నిర్మాణం, ప్రణాళిక, రూపకల్పన, వంతెన నిర్మాణ సమయంలో ఎదురయ్యే అడ్డంకులపై తీవ్రంగా పరిశోధన చేశారు. ఆమె ఇచ్చిన నివేదిక తర్వాతే ఈ వంతెన నిర్మాణ పనులు వేగంగా సాగాయి..
డాక్టర్ లత బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో HAG ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.. మాధవి లత 1992లో జేఎన్టీయూ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు. అక్కడ ఆమె డిస్టింక్షన్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. ఆ తర్వాత వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఎంటెక్ లో ఆమె జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ను స్పెషలైజేషన్ గా ఎంచుకున్నారు.. ఆ తర్వాత 2000 సంవత్సరంలో మాధవి లత ఐఐటి మద్రాస్ నుంచి జియో టెక్నికల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రొఫెసర్ గా స్థిరపడ్డారు.. ప్రొఫెసర్ గా పాఠాలు బోధిస్తూనే.. పరిశోధకురాలిగా ఆమె తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆమె చేసిన సేవలకు గాను 2021లో ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ మాధవి లతను ఉత్తమ మహిళా జియో టెక్నికల్ పరిశోధకురాలిగా గుర్తించింది. ఆమెకు అవార్డు అందించింది. 2022లో మనదేశంలోని స్టీమ్ లోని టాప్ -75 మహిళల్లో మాధవి లత కూడా ఒకరు.
ఆ విధానాన్ని అవలంబించారు
చీనాబ్ వంతెన నిర్మాణంలో స్థలాకృతి, వాతావరణ పరిస్థితులు, వంటివి సవాల్ విసిరాయి. అయితే వాటినింటిని డాక్టర్ లతా బృందం అధిగమించింది. ప్రకృతి ప్రతికూలతలను అభియమించడానికి “డిజైన్ – యాజ్ – యు – గో ” విధానాన్ని మాధవి లత బృందం అవలంబించింది.. ప్రారంభ సర్వేలలో స్పష్టంగా కనిపించని పగుళ్ళు ఉన్న రాళ్లు, అంతర్గత మార్పులు, వివిధ రాతి లక్షణాలు, వంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా.. ఆవిష్కరణలు చేయడం “డిజైన్ – యాజ్ – యు – గో” ప్రధాన లక్షణం. ఈ విధానం అవలంబించి.. డాక్టర్ మాధవి లత బృందం చీనాబ్ నది పై బ్రిడ్జి నిర్మాణంలో కీలకంగా పని చేసింది. నిర్మాణ సమయంలో వారు వాస్తవ రాతి ద్రవ్యరాశి పరిస్థితులను కనుగొన్నారు. వాటి చుట్టూ పనిచేయడానికి ముందు సంక్లిష్టమైన గణన, డిజైన్ మార్పులను నిర్వహించారు. స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి రాతి యాంకర్ ను రూపకల్పన చేశారు. ఇక ఇటీవల మాధవి లత ఇండియన్ జియో టెక్నికల్ జర్నల్ మహిళల ప్రత్యేక సంచికలో ” డిజైన్ యాజ్ యూ గో: ది కేస్ స్టడీ ఆఫ్ చీనాబ్ రైల్వే బ్రిడ్జి” అనే శీర్షికతో ఒక జర్నల్ ను కూడా ప్రచురించింది. వంతెన రూపకల్పన, నిర్మాణం, ఎదురైన ఆటంకాలు, చవిచూసిన ప్రతికూలతల గురించి అందులో మాధవి లత పేర్కొన్నారు.
Also Read: వైసీపీని ఇరుకున పెట్టేలా.. మాజీ మంత్రి పశ్చాత్తాప కామెంట్స్!