Jogi Ramesh Regrets : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతలకు ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతోంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు తాము చాలా తప్పులు చేశామని వారే పశ్చాత్తాపం పడుతున్నారు. అలా చేయక ఉండాల్సిందని చెప్పుకొస్తున్నారు. తమ తప్పులను బయటపెట్టి మరి వారే పశ్చాత్తాపం పడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. భయంతో ఆ మాటలు చెబుతున్నారో.. లేకుంటే వారిలో పరివర్తన కలిగిందో తెలియదు కానీ.. గతంలో జరిగిన తప్పిదాలకు ఇప్పుడు క్షమాపణలు కోరుతున్నారు. అయితే ఇలా క్షమాపణలు కోరుతున్న వారు గతంలో దూకుడు స్వభావం ఉన్న నేతలు కావడం గమనార్హం. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్.
Also Read : ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి: జగన్
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాసనసభ వేదికగా చంద్రబాబు సతీమణి పై అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై జోగి రమేష్( Jogi Ramesh) మాట్లాడారు. అవి ముమ్మాటికి తప్పుడు వ్యాఖ్యలేనని చెప్పుకొచ్చారు. నాడు తన భార్య తనను నిలదీసిందని… అసెంబ్లీకి వెళ్ళేది ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడేందుకేనా అని ప్రశ్నించినట్లు చెప్పారు. చంద్రబాబు సతీమణి పై అలా మాట్లాడొచ్చా అని తనను నిలదీసినంత పని చేసిందని నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఒక్క తన భార్య కాదని.. రాష్ట్రవ్యాప్తంగా కూడా నాటి వ్యాఖ్యలను ఖండించారని చెప్పుకున్నారు. కొంతమంది చేసిన తప్పుల వల్ల పార్టీకి నష్టం జరిగిందని.. దానిని తాము సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
* అమరావతి ఏకైక రాజధాని..
మరోవైపు మూడు రాజధానుల అంశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసిందని ఒప్పుకున్నారు మాజీ మంత్రి జోగి రమేష్. మూడు రాజధానుల( three capitals ) సిద్ధాంతం వల్ల వైసీపీకి నష్టం జరిగిందని.. ఇకపై ఏపీకి అమరావతి రాజధాని అని తేల్చేశారు. ఇకనుంచి మూడు రాజధానుల జోలికి వెళ్ళమని.. జగన్ మళ్ళీ సీఎం అయిన తర్వాత అమరావతి లోనే రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని కి మద్దతుగా రైతులు చేస్తున్న పాదయాత్ర పై నాడు దాడులు కూడా తప్పేనని ఒప్పుకున్నారు. అయితే జోగి రమేష్ ఈ సందర్భంలో పశ్చాత్తాప వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు కారణం ఏమిటా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ టిడిపిలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగా ఆయన చాలాసార్లు సంకేతాలు ఇచ్చారు. ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇప్పుడు కొత్తగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తుండడం వెనుక అసలు వ్యూహం ఏంటి అనేది అంతు పట్టడం లేదు. అయితే మూడు రాజధానుల విషయంలో జోగి రమేష్ అలా మాట్లాడడం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తప్పకుండా జోగి రమేష్ కామెంట్స్ ను వైసీపీ హై కమాండ్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
అసెంబ్లీలో భువనేశ్వరిపై కామెంట్స్.. నా భార్య నిలదీసిందన్న జోగి రమేష్..
అసెంబ్లీకి వెళ్లేది ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడేందుకేనా..? చంద్రబాబు సతీమణిపై అలా మాట్లాడొచ్చా..? అని మమ్మల్ని అడిగారన్న జోగి రమేష్
ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పేనని అంగీకరించిన జోగి రమేష్
ఇది కూడా… pic.twitter.com/wJhDXjuzWJ
— BIG TV Breaking News (@bigtvtelugu) June 7, 2025