
Chandrababu: లోకమంతా ఎలా ఉన్నా.. పచ్చ మీడియా చూపించేది ఒకరకంగా ఉంటుంది. అంటే వారికి మంచిగా అనిపిస్తే లోకమంతా మంచిగానే అనుకోవాలి. వారికి చెడుగా అనిపిస్తే లోకమంతా చెడుగానే అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే వారి కడుపు మంట జనం కడుపు మంట కావాలి.. వారి కనుల పంట లోకమంతా కన్నుల పంట కావాలి. అంతే ఇందులో రెండో దానికి అవకాశం లేదు. ఉండకూడదు. అలాంటి భ్రమాత్మక భావనల్లోనే ఇన్నాళ్లు జనాలను బతికించారు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ భ్రమలు మొత్తం ఒక్కొక్కటిగా తొలగిపోవడం ప్రారంభించాయి.
ఇక చంద్రబాబు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పచ్చ మీడియాకు ఆయన తినే తిండి దగ్గర నుంచి వేసుకునే బూట్ల వరకు ప్రతి ఒక్కటీ ఆశ్చర్యమే.. ఆయనకు డయాబెటిక్ ఉన్నా జయించాడు అని చెప్తుంది. ఆయన అసలు అన్నం తినరని బల్ల గుద్ది చెప్తుంది.. ఆయన 16 గంటలు పని చేస్తారని డంకా బజాయిస్తుంది. మరి ఇన్ని చెప్పిన ఈ పచ్చ మీడియా.. ఇంత దాకా వచ్చేందుకు ఆయన ఎన్ని వెన్నుపోట్లు పొడిచారో చెప్పదు. ఎన్ని స్టే లు తెచ్చుకున్నారో వివరించదు. ఏలేరు స్కాం, స్టాంపుల కుంభకోణం గురించి నోరు మెదపదు.
విజన్ 20 20 గురించి జబ్బలు చరుచుకునే పచ్చ మీడియా.. ఉద్దండరాయునిపాలెంలో వెయ్యికరాల్లో రాత్రికి రాత్రే అరటి తోటలు ఎలా తగలబడ్డాయో ఒక్క వార్త కూడా రాయదు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కౌలు కోసం రోడ్డున ఎందుకు పడ్డారో లేశ మాత్రమైనా చెప్పదు.. అతడి అసలు రూపాన్ని దాచి మిగతా రూపాన్ని మాత్రమే ప్రదర్శిస్తుంది. అందుకే కదా జనం 23 దగ్గర కూర్చోబెట్టింది. ఇప్పుడు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు రాగానే అహో ఓహో అంటూ డప్పులు కొడుతోంది.

అల్లుడు దశమగ్రహం, వాడు నాకు వెన్నుపోటు పొడిచాడు, నా కుటుంబాన్ని ముక్కలు చేశాడు అంటూ పెద్దాయన ఆవేదన ను, ఒలికించిన కన్నీటిని ఈ యెల్లో మీడియా ఏనాడూ రాయదు. రాయలేదు. అమ్ముడు పోయిన ఈ కుల మీడియా చూపించనంత మాత్రాన.. బాబు అసలు రూపం తెలియదు అనుకుంటే పొరబాటే! ఇవి సోషల్ మీడియా రోజులు! స్థూలంగా చెప్పాలంటే బట్టలు ఇప్పి బయట నిలబెట్టే రోజులు!